IPL Auction Live Updates: ఐపీఎల్ వేలం లో ఆశక్తికర విషయాలు..అధిక ధర, అయినా ఇప్పుడు మాత్రం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ల మినీ వేలం మొదలవడంతో ఇప్పుడు క్రికెట్ ప్రియులంతా టీవీలకు, సోషల్ మీడియాకి అతుక్కుపోయారు. ఈ వేలంపాట ప్రక్రియ దుబాయ్ లో నిర్వహించారు.
క్రికెట్ అభిమానులకు మహా ముచ్చటగా అనిపించే ఈ వేలంపాట ఈసారి కూడా రసవత్తరంగానే సాగింది. అలాగే కొన్ని ఊహించని పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి.
ఎప్పుడూ ఓ మోస్తరు ఆటగాళ్లపై ఆసక్తి చూపించే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈసారి మాత్రం ఏకంగా ఓ స్టార్ ఆటగాడిని దక్కించుకుంది.
వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో సెంచరీతో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వేలం పాటతో ఒడిసిపట్టింది.
Travis Head got good price in auction:
ఈ ఐపీఎల్ వేలంపాటలో ట్రావిస్ హెడ్ కనీస ధర 2 కోట్ల రూపాయలు గా ఉంది. ఫ్రాంచైజీలు 2 కోట్ల నుండి ఆపైన పాడుకోవలసి ఉంటుంది. ఇక ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మాన్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడ్డాయి.
పోటాపోటీగా సాగిన వేలం పాటలో, చివరికి సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ట్రావిస్ హెడ్ ను, 6.8 కోట్ల రూపాయలు ధారపోసి అతడిని కైవసం చేసుకుంది.
కేవలం పవర్ ప్లేలో మాత్రమే కాకుండా, మ్యాచ్ లో కూడా ఎటువంటి దశలోఅయినా ప్రత్యర్థులకు ధీటుగా ఆటను ప్రదర్శించగలిగే సమర్ధత ఉన్న ఆటగాడు ట్రావిస్ హెడ్.
కాబట్టి ఇలాంటి పవర్ ఫుల్ ప్లేయర్ రాకతో సన్ రైజర్స్ జట్టు లో బ్యాటింగ్ చేసే వారి సంఖ్య మరింత బలోపేతం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెబుతున్నారు క్రికెట్ ప్రియులు.
Delhi capitals brought harry brook:
ఇదే క్రమం లో సన్ రైజర్స్ విడిచిపెట్టిన ఇంగ్లండ్ యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కు మినీ వేలంలో మంచి రేటు దక్కింది. హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 4 కోట్ల రూపాయలు పెట్టి దక్కించుకుంది.
ఇదే హ్యారీ బ్రూక్ ను లాస్ట్ ఐపీఎల్ సీజన్ లో ఇదే సన్ రైజర్స్ ఫ్రాంచైజీ జట్టు అత్యంత ఎక్కువ ధర వెచ్చించి, రికార్డు స్థాయిలో 13.25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
అయినా సన్ రైజర్స్ కి పెద్దగా తృప్తి కలిగించలేకపోయాడు హ్యారీ బ్రూక్, అతడి స్థాయికి, అతనికి పెట్టిన రేటుకి తగిన రేంజ్ లో పెర్ఫార్మెన్స చూపించలేకపోయాడు, దీంతో సన్ రైజర్స్ ఈ సీజన్ లో అతడిని పక్కన పెట్టేసింది.
sri lanka player vanindu hasaranga dead cheep:
ఈ వేలంలో సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వారు శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను కొనుక్కుంది.
హసరంగను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ1.50 కోట్ల రూపాయలకె చేజిక్కించుకుంది. ఒక విధంగా చుస్తే సన్ రైజర్స్ జట్టు అతడిని చౌక ధరకే దక్కించుకుంది అని చెప్పొచ్చు.
No franchise brought stive smith:
ఇక, ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ ను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఈసారి వేలం పాట లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రోవ్ మాన్ పావెల్ జాక్ పాట్ కొట్టాడని చెప్పాలి.
రోవ్ మాన్ పావెల్ కనీస ధర కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే ఉండగా, అతడిని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ 7.4 కోట్ల రూపాయలు కుమ్మరించి మరీ దక్కించుకుంది.