Devara Release Date: జనతా గారేజ్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Siva) మరో సారి కలిసి పనిచేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా రూపొందుతున్న ఆ సినిమా పేరు దేవర.
ఈ సినిమాలో తారక్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి(Sridevi Kapoor) పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janvi Kapoor) నాయికగా నటిస్తోంది. ఈ అమ్మడుకి తెలుగులో ఇదే తోలి సినిమా.
ఈ సినిమా చిత్రీకరణ సెరవేగంగా జరుపుకుంటోంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుండి ఇదొక అప్ డేట్ తప్పకుండ వస్తుంది అని జూనియర్ ఫాన్స్ ఆశించారు.
వారు ఆశించేది ఏముంటుంది ? అది తప్పకుండ ఈ సినిమా నుండి గ్లిమ్స్ విడుదల అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అటువంటిది ఏమి విడుదల కాలేదు.
అయితే ఒక పోస్టర్ ను మాత్రం విడుదల చేసి అందులో గ్లిమ్స్ విడుదలయ్యే తేదీని ప్రకటించారు. దేవర నుండి జనవరి 8న గ్లిమ్స్ ను వాడుతారని పేర్కొన్నారు.
దేవర సినిమా రిలీజ్ ఎప్పుడంటే : Devara movie release date 2023
తారక్ ఫాన్స్ కి న్యూ ఇయర్ రోజున అదిరిపోయే న్యూస్ వచ్చిందని చెప్పాలి. జూనియర్ నటిస్తున్న తాజా సినిమా దేవర కి సంబంధించి ఒక బంపర్ న్యూస్ బయటకు వచ్చింది.
కొరటాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ను రెండు భాగాలుగా రూపొందిస్తున్న మాట విదితమే, అయితే ఇందులో మొదటి భాగం షూటింగ్ 80 శాతం పూర్తయిందని, ఈ సినిమాను ఏప్రియల్ నెల 5వ తేదీన విడుదల చేస్తారని తెలుస్తోంది.
అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పైగా ఇది తారక్ నటిస్తున్న 30వ సినిమా, దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో శ్రీకాంత్(Srikanth), సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్(Prakash Raj), దసరా ఫేమ్ షైన్ టామ్(Shine Tom), మురళి శర్మ(Murali Sharma) వంటి మేటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవర సినిమాకి ఎన్ని పార్ట్ లు : How many parts of Devara movie are there?
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రాబోతున్న తాజా సినిమా దేవర, ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. వారిద్దరి కాంబినేషన్ లో జనతా గారేజ్ రావడం అది సాలిడ్ హిట్ అవ్వడంతో ఇప్పడు రాబోతున్న దేవర పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక మొదట ఈ సినిమాను ఒకే పార్ట్ లో తీయాలని అనుకున్నారు. కానీ కథ డిమాండ్ మేరకు సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తేనే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమా కి జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మొదటి పార్ట్ కి సంబంధించి 80 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది.
పైగా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలనీ ప్లాం చేస్తున్నారు. రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్(RRR) సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవడం,.
బిలీవుడ్ లో తారక్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. కాబట్టి చిత్ర యూనిట్ ఆ క్రేజ్ ను ఈ సినిమాకి కాష్ చేసుకోవాలని పక్కాగా ప్రణాళిక రచిస్తోంది.
దేవర సినిమా కథ ఏమిటంటే : What is the story of Devara movie?
కొరటాల శివ రాసుకుని దర్శకత్వం వహిస్తున్న సినిమా దేవర, ఈ సినిమా కి సంబంధించిన కథ ఎలా ఉంటుంది, ఇందులో జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అతని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో నెట్టింట ఈ స్టోరీకి సంబంధించి కొన్ని లీకులు వెలువడుతున్నాయి. అదేమిటంటే, ఇండస్ట్రీలోని ఒక ప్రముఖ నటుడు దేవర కథ గురించి చెబుతున్నాడట,
నరరూప రాక్షసుల వంటి విలన్ల నుండి సముద్ర తీరంలో ఉండే ఒక రాయల్ ఫ్యామిలీ ప్రజలను కాపాడుతూ ఉంటుందట. కొన్ని కారణాల వల్ల ఆ ఫ్యామిలీకి చెందిన వారసుడు అజ్ఞాతంలో ఉండటం ఆతరువాత అజ్ఞాతం నుండి బయటకు రావడం జరుగుతుందట.
ఇక హీరో విలన్ల ఆట కట్టించడమే కాకుండా విలన్ల మధ్యే పెరిగిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుంటాడట. ఈ సినిమా ఏప్రియల్ నెలలో విడుదల అవుతుందని, ఇండస్ట్రియల్ హిట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
దేవరలో విలన్ ఎవరు? Who is villain in Devara?
జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే స్టోరీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే జూనియర్ సినిమా ను దర్శకులు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు.
అయితే హీరో ఇంత పవర్ ఫుల్ గా ఉన్నాడంటే విలన్ కూడా చాలా పవర్ ఫుల్ గానే ఉండాలి, విలన్ ఎంత బలంగా ఉంటె హీరోయిజం అంతటి స్థాయిలో ఎలివేట్ అవుతుంది.
అందుకే తారక్ కోసం విలన్ ను సెట్ చేయడానికి డైరెక్టర్స్ నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇక తాజా సినిమా దేవరలో తారక్ తో తలపడటానికి డైరెక్టర్ కొరటాల,
ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గట్టిగానే ప్లాన్ చేశారు. ఈ సినిమా లో తారక్ తో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ఢీ కొట్టబోతున్నాడు. ఇందులో సైఫ్ ప్రతినాయక పాత్ర ను పోషించబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.