Good News For Mahesh Babu Fans: మహేష్ బాబు శ్రీ లీల జంటగా నటించిన సినిమా గుంటూరు కరం, ఈ సినిమాతో శ్రీ లీల కి తొలిసారి మహేష్ తో జత కట్టే అవకాశం దక్కింది.
టైటిల్ కి తగ్గట్టే మహేష్ ఈ సినిమాలో ఘాటుగా హాటుగా కనిపిస్తున్నాడు. ఇక శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా రిలీజైన టీజర్లు, పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ వీరలెవెల్ లో వైరల్ అవుతున్నాయి. పైగా ఈ సినిమా లో మహేష్ శ్రీ లీల కి ధీటుగా స్టెప్పులతో అదరగొట్టినట్టు కనిపిస్తోంది.
గుంటూరు కారం రిలీజ్ డేట్ ఎప్పుడంటే : Guntur kaaram release date?
కుర్చీ మడతపెట్టి అంటూ వచ్చిన సాంగ్ ట్రైలర్ లో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మాస్ నెంబర్ కి మెస్మరైజింగ్ స్టెప్స్ వేశారు. ఇక ఏ ఈసినిమాను 2024 జనవరి నెలలో సంక్రాతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. 2024 జనవరి 12 వ తేదీన వెండితెర పై గుంటూరు కారం సందడి మొదలవుతుంది.
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ : Guntur kaaram trailer release date?
గుంటూరు కారం సినిమా రిలీజ్ కి పెద్దగా సమయం లేదు కాబట్టి త్రివిక్రమ్ దర్శకత్వం వచించిన ఈ సినిమా ప్రమోషన్స్ ను ప్రొడ్యూసర్ ఎస్ రాధా కృష్ణ గట్టిగానే ప్లాన్ చేశారు.
గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి ఆరవ తేదీన హైదరాబాద్ ఓ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పైగా అదే రోజున సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేస్తారట.
ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మహేష్ ఫాన్స్, సూపర్ స్టార్ కృష్ణ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
గుంటూరు కారం సినిమా బడ్జెట్ ? : Guntur kaaram budget?
గుంటూరు కారం సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. మహేష్ బాబు సినిమా అంటే అటు ఫ్యామిలీ ఆడియన్స్, ఇటు యూత్, అలాగే మాస్ ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తారు.
వీరందరూ ఒక ఎత్తయితే మహేష్ కి ఉండే లేడి ఫాన్స్ ఫాలోయింగ్ మరో ఎత్తు, 50 ఏళ్ళు దగ్గర పడుతున్నా చెక్కు చెదరని గ్లామర్ మైంటైన్ చేస్తున్నాడు మహేష్.
అందుకే మహేష్ సినిమా కాస్త హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు కాసుల వర్షం కురుస్తుంది. మరి సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే చాలు రికార్డులు బ్రేక్ అయిపోతాయి.
అందుకు ఉదాహరణే శ్రీమంతుడు ఈసినిమా. ఆ సినిమా టాలీవుడ్ లో బాహుబలి కలెక్షన్లను మించిపోయింది. అందుకే మహేష్ సినిమాకి 200 కోట్లు వెచ్చించడానికి కూడా ప్రొడ్యూసర్ ఎస్ రాధాకృష్ణ వెనుకాడలేదు.
గుంటూరు కారం దర్శకుడు : Guntur kaaram director?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వీరిద్దరి కంబో లో అతడు, ఖలేజా వంటి సినిమాలొచ్చాయి.
అతడు సినిమాలో ప్రేక్షకులకు త్రివిక్రమ్ మహేష్ ను చాలా స్టైలిష్ గా చూపించారు, పైగా ఆ సినిమాలో మహేష్ తో సెటిల్డ్ కామెడీ చేయించి నవ్వులు పూయించారు.
ఇక ఖలేజా విషయానికి వస్తే మహేష్ లో పక్కా మాస్ అబ్బాయిని బయటకి తీశారు. ఈ రెండు సినిమాలు థియేటర్ లో కన్నా బుల్లి తెరమీద యూట్యూబ్ లో బాగా ఫెమస్ అయ్యాయి.
ఈ సారి వారిద్దరూ కలిసి చేసే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఈ మూవీ దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైపోయేలా ఉండాలని ప్లాన్ చేశారు. గుంటూరు కారం నిజంగా గుంటూరు కారం అంత ఘాటుగా ఉంటుందని మూవీ యూనిట్ ధీమాగా ఉంది.
గుంటూరు కారంలో నాయిక ? : Guntur kaaram movie heroine?
గుంటూరు కారం సినిమా లో మహేష్ సరసన మొదట పూజా హెగ్డే ను తీసుకున్నారు, కానీ అనుకోని కారణాల వల్ల పూజ ప్లస్ ను శ్రీ లీల రీప్లేస్ చేసింది. పైగా పూజ హెగ్డే మహేష్ తో మహర్షి సినిమా కోసం ఆల్రెడీ జోడీ కట్టింది.
కాబట్టి పూజ తప్పుకోవడంతో మహేష్ ఫాన్స్ మహేష్ సరసన మరో కొత్త అందాన్ని అందులోను తెలుగు అందాన్ని చూసే అవకాశం పొందారు. పైగా ఈమధ్య కాలంలో శ్రీ లీల టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉంది, భగవంత్ కేసరి తో తనలోని నటిని కూడా బయటపెట్టింది.
శ్రీయ లీల తో పాటు ఈ సినిమాలో మహేష్ కి జోడీ గా మరో బ్యూటీ కూడా ఉంది, ఆమె మీనాక్షి చౌదరి, ఇప్పటికే ఖిలాడీ, హిట్ 2 వంటి చిత్రాలతో ఈ అమ్మడు మంచి గుర్తింపు పొందింది.
గుంటూరు కారం విలన్ ? : Guntur Kaaram Villan?
మహేష్ బాబు సినిమా లో విలన్ పవర్ ఫుల్ గానే ఉంటాడు, అయితే మహేష్ సినిమాలో దర్శకులు కథ డిమాండ్ మేరకే విలన్లను డిమాండ్ చేసుకున్నరునై మనం చెప్పొచ్చు.
అందుకు గత చిత్రాలే ఉదాహరణ, ఇక కొత్తగా రాబోతున్న గుంటూరు కరం సినిమాలో మహేష్ ను ఢీ కొత్తబిపోయేది ఎవరు అని చాలన్నది ఆతృతగా ఎదురు చూస్తున్నారు,
ఈ సారి మహేష్ తో తలపడే ఛాన్స్ అర్జున్ దాస్ కి దక్కింది. అర్జున్ దాస్ తమిళ సినిమాలతో ఫెమస్ అయ్యారు. ముఖ్యంగా తన బేస్ వాయిస్ తో పలికే సంభాషణలు ప్రేక్షకుల్లో తనకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది.