Mahua Moitra: లోక్ సభ నుంచి మహువా మొయిత్రా బహిష్కరణ.
ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తృణమూల్ కాంగ్రేస్ నాయకురాలు మహువా మొయిత్రాని పార్లమెంటు నుంచి బహిష్కరించాలని సిఫార్సు.
తీవ్రమైన, చట్టపరమైన, సంస్థాగత విచారణ ” కోసం ఆమె పిలుపునిచ్చిన తరువాత లోక్ సభ నుంచి బహిష్కరించబడ్డారు. టీఎంసీ ఎంపీ ఇంకొక వ్యక్తితో లాగిన్ ఆధారాలు పంచుకున్న చర్యను ” అనైతిన ప్రవర్తన” మరియు “సభను ధిక్కరించడం ” అని నివేదికలో వెల్లడి అయింది.
శ్రీ దర్శన్ హిరానందాని మరియు మహువా మొయిత్రాల మధ్య జరిగిన నగదు లావాదేవీలపై ” క్విదో ప్రోకో “లో భాగంగా సమయానుకూల దర్యాప్తు చేపట్టాలని ఈ నివేదిక వెల్లడించింది.
లోక్ సభలో అటువంటి ప్రశ్నలు అడిగేందుకు హిరానందాని దగ్గరనుంచి లంచం తీసుకున్నట్టుగా మహువా మొయిత్రా పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఇచ్చిన కంప్లైంట్ పైన ఎథిక్స్ కమిటీ సరైన రీతిలో విచారణ జరిపింది.
ఈ లోక్సభ బహిష్కరణను మొయిత్రా సుప్రీమ్ కోర్ట్ లో సవాలు చేసే అవకాశం ఉందని, రాజ్యాంగంలోని 122వ ఆర్టికల్ పరిశీలిస్తీ కోర్టు సవాలు నుంచి విచారణకు మినహాయింపు దొరుకుతుందని లోక్ సభ మాజీ సెక్రెటరీ జెనెరల్ PDT ఆచారి తెలిపారు.
ఆర్టికల్ 122 లో ” పార్లమేంటులో ప్రక్రియను నియంత్రించేందుకు, వ్యాపారాన్ని నియంత్రించడానికి ,ఆర్డర్ ని నిర్వహించేందుకు ఈ రాజ్యాంగం లేదా అధికారాలు ఉన్న ఆ అధికారి కానీ ఎంపీ గని అధికారాలు ఉపయోగించుకునే విషయంలో ఏదైనా న్యాయస్థానానికి లోబడి ఉండదు” అని ఉంది. ఈ క్రమంగా ఆమె సవాలు చేయవచ్చు.