Extra movie new song release: నితిన్ సినిమా ఎక్స్‌ట్రా నుండి మరో పాట విడుదల.
నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎక్స్‌ట్రా. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.
వక్కంతం వంశి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ లో శ్రీలీల నితిన్ కు జోడి గా నటిస్తోంది. అసలే నితిన్ అంటే హుషారైన కుర్రాడు, యూత్ ఫుల్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు.
మరి అలాంటి నితిన్ కి డైనమైట్ లాంటి శ్రీలీల జోడి కడితే ఇంకెలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. దానిని తెరమీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పటికే మూవీ టీమ్ ఈ సినినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
డిసెంబర్ 8వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. అందులో భాగంగానే మరో సాంగ్ ను కూడా లంచ్ చేశారు.
మైండ్ అంతా రీసెర్చ్ చేస్కో అంటూ సాగే ఈ పాటను విడుదల చేయగా, దీనిని సంజిత్ హెగ్డే ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన ఈ క్యాచి లిరిక్స్ కి హరీష్ జై రాజ్ బాణీని సమకూర్చాడు. మొత్తంగా ఈ పాట ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఈ సినిమా దర్శకుడు వక్కంతం వంశి గురించి చెప్పాలంటే బేసిగ్గా వంశి స్క్రీన్ ప్లే రైటర్ గా రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టెంపర్, రేసు గుర్రం, కిక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు కథను అందించాడు.
దర్శకుడిగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒక ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్ హీరోగా చేసిన ఈ సినిమా ఒక సెట్ ఆఫ్ పీపుల్ ను బాగా మెప్పించింది.
సినిమా జయాప జయాలతో సంబంధం లేకుండా వంశీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దర్శక రత్న దాసరి ఒక మాట అన్నారు. మంచి దర్శకుడు, రచయితగా రాణిస్తాడో లేదో చెప్పలేము కానీ, మంచి రచయిత మాత్రం గొప్ప దర్శకుడిగా రాణిస్తాడు అని అన్నారు.
కాబట్టి వక్కంతం పై నితిన్ పెట్టుకున్న నమ్మకం నిజమై, ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.