Fake Police In Telangana: తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..పోలీసుల వేషంలో కోట్లు దోపిడీ.

Add a heading 2023 11 20T135531.810 Fake Police In Telangana: తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..పోలీసుల వేషంలో కోట్లు దోపిడీ.

Fake Police : తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..హవాలా వ్యాపారులే టార్గెట్..పోలీసుల వేషంలో కోట్ల దోపిడీ.

తెలంగాణా రాష్ట్రం లో ఎన్నికల హడావుడి నెలకొంది. మరి ఎన్నికలు వస్తున్నాయంటే నోట్ల కట్టలు, మందు సీసాలు వేరే లెవెల్ లో పంపిణి చేయడం షరా మామూలే. ఎన్నికల కమిషన్ ఎంత కట్టడి చేసినా ఎదో ఒక రకంగా వీటి అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉంటారు.

అయితే వీరి ఆట కట్టించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ చెక్ పోస్టుల వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.

పరిమితికి మించి డబ్బును తీసుకువెళుతున్న వారు అందుకు సరైన ఆధారాలు లేదంటే పత్రాలు చూపించని యెడల ఆ డబ్బును సీజ్ చేస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొంత మంది కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.

పోలీసుల వేషంలో బెదిరింపులకు పాల్పడి డబ్బు దోచుకుంటున్నారు. అందుకు ముఖ్యంగా హవాలా వ్యాపారం చేసే వారిని టార్గెట్ చేసుకున్నారు.

ఎలక్షన్ కమిషన్ ఇంకా పోలీసుల పేరుతో స్థానిక రౌడీ షీటర్లు, వివిధ పార్టీల గల్లీ లీడర్లే డబ్బులు దోచుకుంటున్నారు. హోల్‌‌‌‌సేల్‌‌‌‌ మార్కెట్లు, హవాలా వ్యాపారులు ఎక్కువగా వీరి చేతికి చిక్కుతున్నారు.

ఇందుకోసం హైదరాబాద్‌లోని బేగంబజార్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌ మోండా మార్కెట్‌‌‌‌ లోని వ్యాపారులనే కాక, బంగారం వ్యాపారం చేసే వారిని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా బంగారం వ్యాపారం చేసే వారి వద్ద డబ్బు ఎప్పుడు నోట్ల రూపం లోనే ఉంటుంది.

బంగారం కొనుగోలు చేసే వారు కూడా డబ్బుగానే తీసుకొచ్చి ఇచ్చి బంగారం కొనుగోలు చేస్తారు. కాబట్టి ఏ ప్రాంతాల్లో బంగారం వ్యాపారం చేసే వారివద్ద అయినా డబ్బు నిల్వ సాయంత్రానికి ఎక్కువ మొత్తం లోనే ఉంటుంది.

Add a heading 2023 11 20T124227.162 Fake Police In Telangana: తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..పోలీసుల వేషంలో కోట్లు దోపిడీ.

ఇక సాయంత్రానికి ఆ డబ్బును ఇంటికి తీసుకెళ్లక తప్పదు, అందుకే వీరిని టార్గెట్ చేశారు అక్రమార్కులు. ఇక మరో తరహా వ్యాపారస్తులు కూడా హైదరాబాద్ లో ఉన్నారు.

వారిలో జీఎస్టీ తోపాటు ఇతర ట్యాక్స్‌లను తప్పిచుకునేందుకు బ్లాక్ మార్కెట్ బిజినెస్ చేసే వారు ఉన్నారు. వీరి దగ్గర ఇక్కడ డిజిటల్, ఆన్లైన్ పేమెంట్స్‌‌‌‌ ఉండవు.

ప్రతి వ్యాపారి దగ్గర నోట్లు కట్టలు కట్టలుగా ఉంటాయి. ఈ డబ్బును యధావిధిగా దాచుకునే వారు కొందరైతే హవాలా రూపంలో తరలించేవారు మరికొందరు.

కాబట్టి పోలీసుల వేషంలో ఉన్న ఈ కేటుగాళ్లు వీరిని టార్గెట్ చేశారు. సుమారు నలుగురైదుగురు దుండగులు ఒక ముఠా గా ఏర్పడి ఈ దోపిడీ మొదలు పెట్టారు. సాయంత్రం వ్యాపారం ముగించుకుని ఇళ్లకు వెళ్లేవారిని టార్గెట్ చేసుకున్నారు.

మేము మఫ్టీ లో ఉన్న పోలీసులం, అంటూ తనిఖీలు చేస్తున్నారు. డబ్బు గనుగ దొరికితే ఆట షురూ చేస్తున్నారు. మీ వద్ద ఉన్న డబ్బుకి సరైన పత్రాలు ఉన్నాయా అంటూ గద్దించి అడగటం మొదలు పెడతారు.

లెక్కకు మించి ఉన్న డబ్బును సీజ్ చేస్తున్నాం అంటూ బాధితులకు చక్కగా పంగనామం పెడుతున్నారు. ముందు పోలీసులే డబ్బును సీజ్ చేశారనుకుని బాధపడిన వారు, ఆ తరువాత అసలు విషయం తెలిసి కళ్ళు తేలేస్తున్నారు.

అయితే వారు జీఎస్టీ ని ఎగవేయడానికి చేసేది కూడా అక్రమ దందా నే కాబట్టి కొందరు బాధితులు తేలుకుట్టిన దొంగలాగా మిన్నకుండిపొతే, మరికొందరు మాత్రం తెగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అప్రమమతమైన పోలీసులు వ్యాపారస్తులకు తగు సూచనలు చేస్తున్నారు. నకిలీ అధికారులతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా 100కి డైల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Leave a Comment