అసత్య ప్రచారం – మీడియా సంస్దల పై KTR, బామ్మర్ది పరువునష్టం కేసు 160 కోట్లు

website 6tvnews template 2024 03 27T112658.862 అసత్య ప్రచారం - మీడియా సంస్దల పై KTR, బామ్మర్ది పరువునష్టం కేసు 160 కోట్లు

ఇటీవల హైదరాబాద్ రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ వ్యవహారం కల కలం లేపింది. ఇందులో సినిమా ఇండస్ట్రీ తో పాటు పలు రాజకీయ పార్టీ లకు చెందినా వ్యక్తులు ఉన్నారంటూ ఎన్నో వార్తలు హలచల్ చేసాయి. అయితే ఇంత వరకు పోలీసులు కూడా ఎవరు అనేది తేల్చలేదు. కాని చాల భారీ మొత్తం లో డ్రగ్స్ బయట పడ్డాయి. ఆ సమయం లో అక్కడ ఉన్న వారిని విచారించాం కాని ఇంకా కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంకా పలు కోణాలలో ఎంక్వయిరీ చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇంతకు ముందు పాత నేరస్డులు తో దీనికి సంబందం ఉందా అనే కోణం లో కూడా విచారణ జరుపుతున్నాం అని చెప్తున్నారు పోలీసులు.

అయితే ఇప్పుడు దీనికి సంబందించి కొన్ని మీడియా సంస్దలు తప్పుడు ప్రచారం చేసినట్లు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శిస్తూ వస్తున్నారు. అసత్యాలను ప్రచారం చెయ్యడం వల్ల ప్రముఖుల జీవితాలు చాల నష్ట పోతాయని, వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని ఆయన విమర్శించారు. ఇందులో బడా వ్యక్తులు ఉన్నారని మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది.

దీనికి సంబందం ఉన్న ఒక BJP రాజకీయ నాయకుడు కొడుకు తో పాటు ఒక బిజినెస్ మాన్ కూడా ఉన్నట్లు చెప్తూ దీనికి సంబందం ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చెయ్యడం జరిగింది.అంతే కాదు ఈ డ్రగ్స్ తో మాజీ మంత్రి KTR బామ్మర్ది పాకాల రాజేంద్ర ప్రసాది కూడా ఉన్నారని దీనికి ఆయనే ప్రధాన సూత్ర దారి అంటూ కొన్ని మీడియా సంస్దలు వార్తలు ప్రసారం చేసాయి. ఈ డ్రగ్స్ దందా లో KTR కి కూడా ప్రమేయం ఉందనే వార్తలు కూడా ప్రసారం చేసాయని ఆయన ఆరోపించారు. దీనికి మాకు ఎం సంబందం లేదు అని చెప్పిన అలాగే ప్రసారం చేస్తూ వచ్చారు.

ఇప్పుడు దీనికి సంబందించి మర్నాడు ఇంకో వార్త ప్రసారం చెయ్యడం తో KTR ఆయన బామ్మర్ది రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి దాదాపు 16 మీడియా చానెల్స్ మీద కొన్ని యు ట్యూబ్ చానల్స్ మీద కూడా పరువు నష్టం దావా వేసారు. ఒక్కక్క మీడియా ఛానల్ పై 10 కోట్లు చొప్పున మొత్తం 16 చానల్స్ మీద 160 కోట్లు కి పరువునష్టం దావా కేసులు వేసినట్లు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.

Leave a Comment