Fans reaction on Salaar trailer: సలార్ ట్రైలర్ పై అభిమానుల స్పందన….
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యింది.
యంగ్ రెబల్ స్టార్ అభిమానులకి ఇది చాలా పెద్ద పండగ. సలార్ సినిమాకి సంబంధిచిన అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుంచో
ఎదురుచూస్తున్నారు. అలాంటి ఎదురుచూపుల మధ్య ఈ ట్రైలర్ రావడం నిజంగా అభిమానులకి విందుభోజనమే.
అయితే ఈ ట్రైలర్ చుసిన ప్రేక్షకులు, ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం అయిన ఉగ్రం సినిమా లక్షణాలు కొన్ని ఉన్నాయని అలాగే KGF సినిమా నుంచి వచ్చిన పాత్రలలాగా అనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు KGF సినిమాకి సలార్ సినిమాకి ఎదో సంబంధం ఉంది అని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి, దాంతో ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇపుడు విడుదల అయినా భాగం సలార్ : పార్ట్ 1 కాల్పుల విరమణ, ఇది సలార్ మొదటి భాగమని, ఇక రెండవ భాగం భారీ యాక్షన్
పార్ట్ లతో ఉండబోతుందని సమాచారం.
హోంబలే ఫిలింస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవబోతుంది.
సలార్ ట్రైలర్ లో ప్రభాస్ పాత్రని చాలా వొయిలెంట్ గా చూపించారు. బాహుబలి తర్వాత ఇలాంటి పాత్ర చేయడం సలార్ లోనే.
ట్రైలర్ లో ఒక వ్యక్తి, చిన్నతనంలోనే తన స్నేహితుడికి మాట ఇస్తాడు, నీకోసం ఎం అయినా అవుతానని, స్నేహం విలువ పై సాగె ఈ కథలో, విడదీయలేని స్నేహం ఉండేది అంటే స్నేహంలో జరిగే పోరుల కనపడుతోంది.
హోంబలే యూట్యూబ్ లో ” మాతో తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉండండి, ఈ డిసెంబర్ 22న అంత్యంత హింసాత్మకమైన వ్యక్తిని స్క్రీన్ పైన చూసుకోండి ” అని పెట్టింది. దీనితో ప్రేక్షకులలో ఉత్సహం మరింత పెరిగింది.
సలార్ లో ప్రభాస్ తో పాటు శృతిహాసన్, ఈశ్వరి రావ్, ఆనంద్, జగపతి బాబు, శ్రియ రెడ్డి, గరుడ రామ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.