Fire Accident in Nalgonda: నల్గొండలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు సజీవదహనం 38 పరిస్థితి విషమం.

Fatal fire accident in Nalgonda..One person was burnt alive, 38 are in critical condition

నల్గొండలో ఘోర అగ్ని ప్రమాదం…ఒకరు సజీవదహనం 38 పరిస్థితి విషమం..

హైదరాబాద్​ నుంచి చీరాలకు వెళ్తున్న బస్సు నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందేలోపే బస్సు దగ్ధమయింది.

ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా అందులో వ్యక్తిసజీవదహనంఅయ్యాడు.ప్రమాదం ఏ సమయంలో జరుగుతుందో, ఎప్పుడు ఎలా సంభవిస్తుందో ఎవరూ ఊహించలేరు.

కానీ, జరిగినప్పుడు మాత్రం కుటుంబ సభ్యులను, బంధువులలు, స్నేహితులను కోల్పోవల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది.. గుండెను పిండే బాధా కూడా తప్పదు.

తాజాగా నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదం మే ఒక ఉదాహరణ..ఈ సంఘటన ఎంతో విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ నుంచి చీరాలకు వెళ్తున్న సమయంలో నల్గొండ జిల్లాకు చేరుకున్న ఓ ప్రైవేట్​ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా అందులో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు.

ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం : ఓ ప్రైవేట్​ బస్సు హైదరాబాద్​ నుంచి చీరాలకు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో మర్రిగూడ బైపాస్​ రోడ్డు వద్దకు రాగానే మంటలు చెలరేగాయి.

ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు బస్సులో నుంచి పరుగులు తీశారు. అయితే, అప్పటికే మంటలు తీవ్రతరం కావడంతో ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు.

ప్రయాణం జరిగిన సమయంలో బస్సులో 39 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మిగిలిన ప్రయాణికుల్లో ఎంత మందికి గాయాలయ్యాయో తెలియాల్సి ఉంది.వ్యాన్​పై విద్యుత్​ తీగ పడి చెలరేగిన మంటలు.. – అగ్నిమాపక సిబ్బంది చొరవతో తప్పిన పెనుప్రమాదం.

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బస్సులో మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే చేదాటిపోయే సరికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలు ఆర్పారు.

అయితే, అప్పటికే బస్సు 80శాతం దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఇక ఆ బస్సు లో సజీవదహనమైన వ్యక్తి వివరాలను సేకరినుంచే ప్రయత్నం లో ఉన్నారు అధికారులు. అలాగే, ఇప్పటి వరకు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Add a heading 2023 12 04T112333.477 Fire Accident in Nalgonda: నల్గొండలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు సజీవదహనం 38 పరిస్థితి విషమం.

“బస్సులో పొగ వస్తోందని మేమందరం డ్రైవర్​కు చెప్పాం. ఆ విషయం డ్రైవర్​ గమనించి ఏం కాదు అని చెప్పాడు. కాసేపటికే మంటలు వచ్చాయి. బస్సు ఆపివేసి అందరూ బయటకి వెళ్లిపోమని డ్రైవర్​ చెప్పాడు. వెంటనే అందరం మేల్కొని ఉండడంతో బయటకి వచ్చేశాం.

మాతో తెచ్చుకున్న వస్తువులన్నీ మంటల్లో కాలిపోయాయి. ఇప్పటివరకు ట్రావెల్స్​ ఓనర్స్​ స్పందించలేదు. డ్రైవర్​ వేరే బస్సు ఎక్కి వెళ్లమని చెబుతున్నారే తప్ప, ఆ ట్రావెల్​ బస్సు తెప్పించలేదు.

ప్రమాదం జరిగే 10 నిమిషాల ముందు డాబా దగ్గర ఆపారు. అందువల్ల అందరూ మేల్కొని ఉన్నారు. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని ఆ బస్సులో ప్రయాణించిన ప్రయాణికులు కన్నీరుమున్నీరు అవుతున్నట్లు సమాచారం..ప్రయాణికుడు

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నిద్రమత్తులో బస్సును నుండి దిగకపోవడం వల్లే ఆ వ్యక్తి చనిపోయినట్లు భావిస్తున్నారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Leave a Comment