Ayodhya Ramaiya statue: రామ విగ్రహ రూపకర్త యోగి రాజ్ విశేషాలు.

Features of Rama idol designer Yogi Raj.

Ayodhya Ramaiya statue: అయోధ్య లో నిర్మితమైన రామ మందిరానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. పైగా ఈ అయోధ్య రామ మండితంలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్న తేదీ కూడా అదే.

ఈ క్షణం కోసం యావత్ భారత్ భారత్ దేశం ఎంతో ఆశక్తిగా, ఆతృతగా ఎదురుచూస్తోంది, ఆ తారీఖు దగ్గరపడుతున్నకొద్దీ దేశం మొత్తం ఆధ్యాత్మిక శోభా వ్యాప్తి చెందుతూ ఉంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే కాదు, ఆయనతోపాటు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకి సంబంధించిన అనేక మంది ప్రముఖులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి.

ఇక ఈ కార్యక్రమంలో అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీరామ చంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట. ఈ విగ్రహాన్ని ప్రతిష్టించే క్షణం కోసం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

ఆసమయాన్ని ఎవ్వరూ ఎప్పటికి మర్చిపోలేరు. అయితే ప్రతుతం చాలామంది శ్రీ రాముని విగ్రహం గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ రఘురాముని విగ్రహం ఇక్కడ ప్రతిష్టించిన అనంతరం సంవత్సరాల తరబడి శతాబ్దాల తరబడి పూజలు అందుకోవాలి, అందుకుంటుంది. మరి అటువంటి విగ్రహం ఎక్కడ తయారైంది ? ఎవరు తయారు చేశారు అనే విషయాలు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.

శ్రీరామ విగ్రహ శిల్పి యోగి రాజ్ : Sculptor of Sri Rama idol Yogi Raj

aruin 696x480 1 Ayodhya Ramaiya statue: రామ విగ్రహ రూపకర్త యోగి రాజ్ విశేషాలు.

అయోధ్య లో శ్రీరామచంద్రమూర్తి(Lord Sri Rama) విగ్రహాన్ని తయారు చేసింది కర్ణాటక(Karnataka) రాష్టంలోని మైసూర్(Mysore) లో, అయితే ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి పేరు అరుణ్ యోగి రాజ్(Arun Yogi Raj).

దేశంలో ఏంటో మంది శిల్పులు ఉన్నారు, అయినప్పటికి రఘునందనుడి విగ్రహాన్ని తయారు చేసే భాగ్యం ఎవరికీ ఇవ్వాలో ఆ దశరధ తనయుడికి తెలుసు, కాబట్టి ఈ అవకాశాన్ని ఆ సీతాపతే స్వయంగా ఈ ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగి రాజ్ కి అప్పగించి ఉంటాడు.

యోగిరాజ్ శిల్పి మాత్రమే కాదు : Yogiraj was not only a sculptor

అరుణ్ యోగి రాజ్ శ్రీ రాముడి విగ్రహాన్ని తయారు చేయడం వల్ల అతని పేరు ప్రతిష్టలు దేశ వ్యాప్తంగా పాకిపోయాయి.

ఏకంగా కేంద్ర మంది ప్రహ్లాద్ జోషి(Central Minister Prahlad Joshi) తన ఎక్స్ ఖాతాలో యోగి రాజ్ గురించి ప్రస్తావించారు అంటే మాములు విషయం కాదు.

శ్రీరాముడి విగ్రహ తయారీ బాధ్యతలు అప్పగించారు అంటే అతని వయసు ఏ 70 సంవత్సరంలో అనుకోవచ్చు, కానీ అతనికి నిండా నలభై ఏళ్ళు కూడా లేవు.

ఆటను 37 సంవత్సరాల వ్యక్తి. యోగి రాజ్ శిల్పుల వంశానికి చెందిన వాడు, అతని పూర్వీకులు అందరు కూడా శిల్పులే. ఇక వీరు వడియార్(Vadayar) సంస్థానాల భవనాలకు మెరుగులు దిద్దడంలో చేయితిరిగిన శిల్పిగా పేరు గాంచారు.

అయితే చేతి వృత్తుల్లో నిష్ణాతులైన వారు, వంశ పారంపర్యంగా వస్తున్నా వృత్తిని చేపట్టిన వారు పెద్దగా చదువుకుని ఉండరు

అని అంత అనుకుంటాం కానీ యోగిరాజ్ ఎంబీఏ(MBA) కూడా చేశాడు. చేతి వృత్తిని కొనసాగిస్తూనే మైసూర్ యూనివర్సిటీలో(Mysore University) ఉన్నతచదువులు చదివాడు.

Leave a Comment