Fighter censor: విక్రమ్ వేద (Vikram Vedh)సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న మూవీ ఫైటర్ (Fighter). ఈ మూవీ హృతిక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫైటర్ ఫస్ట్ లుక్ మొదలు సాంగ్స్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
హృతిక్ రోషన్, బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె (Deepika Padukone), సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్‌ల(Anil Kapoor)తో పాటు కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover) ,అక్షయ్ ఒబెరాయ్ వంటి సీనియర్ నటులు ఈ మూవీలో నటిస్తున్నారు.
పఠాన్ (Patan), వార్ (War)సినిమాను డైరెక్ట్ చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఫైటర్ సినిమాకు దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్ (Viacom 18 Studios), మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ (Morphlix Pictures) సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు.
రిపబ్లిక్ డే (Republic Day) గిఫ్టుగా జనవరి 25న రిలీజ్ కు రెడీ ఉన్న ఈ మూవీ సెన్సార్ ను పూర్తి అయ్యింది. అయితే కొన్ని సన్నివేశాలను, ఓ పాటను పూర్తిగా డిలీట్ చేయాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్లు సమాచారం.
bold scenes between Hrithik and Deepika Deleted: హృతిక్, దీపికల మధ్య ఉన్న బోల్డ్ సీన్స్ కట్
ఫైటర్ (Fighter)మూవీ సెన్సార్ పూర్తి (censor complete)అయ్యింది. అయితే ఈ మూవీలోని కొన్ని సీన్స్ కట్ చేయాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్లు తెలుస్తోంది. సినిమా నుండి ఓ పాటను పూర్తిగా తొలగించాలని సెన్సార్ సభ్యులు సూచించారట.
అవును మీరు విన్నది నిజమే ..ఈ మూవీలో ఉన్న ‘ఇష్క్ తోడా తోడ దోనో జగా’ అనే 2 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉన్న పాటను డిలీట్ చేశారు. అలాగే హృతిక్ రోషన్ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone)ల మధ్య ఉన్న కొన్ని బోల్డ్ సీన్స్ కట్ చేశారు.
అంతే కాదు సినిమాలో వచ్చే కొన్ని బూతు పదాలను మ్యూట్ లో పెట్టాలని సెన్సార్ బోర్డు చెప్పిదట. యువతని లైంగికంగా ప్రేరేపించే కొన్ని సీన్స్ కూడా మేకర్స్ కట్ చేశారని తెలుస్తోంది. ఇక టీవీ న్యూస్ చెప్పే వీడియోలో 25 సెకన్ల ఆడియోను కూడా మేకర్స్ డిలీట్ చేశారు.
ఈ సీన్లను పూర్తిగా డిలీట్ చేసిన తర్వాతనే ఫైటర్ కు U/A సర్టిఫికేట్ ( U/A certificate) జారీ చేశారు. సెన్సార్ నివేదిక ప్రకారం ఫైటర్ మూవీ నిడివి 166 నిమిషాలు. అంటే రన్ టైమ్ 2 గంటల 46 నిమిషాలు.
Amazing Advance bookings : అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
సెన్సార్ పూర్తి కావడంతో ఫైటర్ (Fighter)అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి. టికెట్లను బుక్ చేసుకునేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తొలిరోజే 86,516 అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. రూ. 2.84 కోట్ల వసూళ్లను సినిమా రిలీజ్ ముందే సాధించింది.
ఇందులో 2డీ హిందీ వెర్షన్ కు 33,624 టిక్కెట్లు, 3డీ హిందీ వెర్షన్ 46,790 టిక్కెట్లు, ఐమాక్స్ 3డీ యాక్షన్ 4,881 టిక్కెట్లు, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ 1,221 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తో భారీ స్థాయిలో వసూళ్లు వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.
Gulf countries not agreeing to release Fighter?: ఫైటర్ సినిమా రిలీజ్‌కు ఒప్పుకోని గల్ఫ్ దేశాలు
ఇదిలా ఉంటే భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఫైటర్(Fighter) మూవీ రిలీజ్ ను గల్ఫ్ దేశాలు (Gulf countries) అడ్డుకుంటున్నాయి. యూఏఈలో తప్పా ఇతర గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల కావడం లేదని ప్రొడ్యూజర్ గిరీష్ జోహార్ (Girish Johar) అనౌన్స్ చేశాడు.
దీంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న హృతిక్ ఫ్యాన్స్ నిరాశచెందుతున్నారు. అయితే గల్ఫ్ దేశాలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయన్న కారణాన్ని మాత్రం గిరీష్ చెప్పలేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై స్పష్టత ఇవ్వడానికి మేకర్స్ ముందుకు రావడం లేదు. గల్ఫ్ దేశాల సెన్సార్ బోర్డ్ నుంచి ఫైటర్ కు గ్రీన్ సిగ్నల్ అందలేదని, అందుకే సినిమా అక్కడ విడుదల కావడం లేదని టాక్ .