Fighter teaser Release: ఫైటర్ టీజర్.
ఫైటర్ టీజర్ వచ్చేసింది. ఫైటర్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఈ టీజర్ శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యింది. ఇది ఒక యాక్షన్ రైడ్.జనవరి 25వ తారీఖున కొత్త ఏడాది 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ఫైటర్.
ఫైటర్ సినిమాలో హృతిక్ రోషన్, దీపికా పడుకునే, అనిల్ కపూర్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా లో స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా గా హృతిక్ రోషన్, స్క్వాడ్రన్ లీడర్ మినల్ రాథోడ్ గా దీపికా పదుకునే, గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తున్నారు. వీరి కథలే ఈ ఫైటర్ సినిమా.
వీరు తమ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సైతం వెనుకాడరు. టీజర్ లో యుద్ధ విమానాలలో సాగె కథనాలు కనిపిస్తున్నాయి, మంచు కప్పైనా శిఖరాల మధ్య మేఘాల మధ్య, ఈ ఫైటర్లను ఎవరు కనుక్కోలేరు, ఎవరు పట్టుకోలేరు,ఎవరు ఆపలేరు, ఇలాంటి తరహాలో మాటలు టీజర్ లో కథని, పాత్రలని బలోపేతం చేస్తూ మాట్లాడతాయి.
దీపికా పడుకునే తన సోషల్ మీడియాలో ఈ టీజర్ గురించి పంచుకుంటూ, ఫైటర్ ఫరెవర్ అంటూ రాసారు.
ఈ ఫైటర్ సినిమా సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న హిందీ చిత్రం. యాక్షన్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ మరియు మార్ప్లిక్స్ పిక్చర్స్ లో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది.
దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా పైన చిత్ర బృందానికి అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఫైటర్ సినిమా రిపబ్లిక్ డే సందర్బంగా 25 జనవరి 2024లో విడుదల చేయనున్నారు.
ముందుగా ఈ సినిమాని 2021 జనవరిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు కానీ, కరోనా మహమ్మారి వల్ల అది కుదరలేదు.ఆ తర్వాత సెప్టెంబర్ 30 2022 న విడుదల ప్రకటించారు కానీ అది కూడా కుదరలేదు, కానీ ఈ సారి మాత్రం రిపబ్లిక్ డే సందర్బంగా సినిమా విడుదల అవ్వాల్సిందే నని అంటున్నారు అభిమానగణం .