Firecrackers Ban Across Country : సుప్రీం కీలక ఆదేశాలు, దీపావళి రోజు టపాసుల మోత వద్దు,

11 Firecrackers Ban Across Country : సుప్రీం కీలక ఆదేశాలు, దీపావళి రోజు టపాసుల మోత వద్దు,

Firecrackers Ban Across Country : సుప్రీం కీలక ఆదేశాలు. దీపావళి రోజు టపాసుల మోత వద్దు.

Firecrackers Ban Across Country : సుప్రీం కీలక ఆదేశాలు.. దీపావళి రోజు టపాసుల మోత వద్దు..అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పాటించాల్సిందే..

దీపావళి గురించి ఒక వ్యాసం రాయమంటే చిన్న పిల్లలు కూడా ముందు రాసే పంక్తి ఒక్కటే, దీపావళి నిజమైన అర్ధం దీపాల సమూహం అని, కానీ దీపావళి వచ్చిందంటే చాలు బాణా సంచా మోత తో చెవులు చిల్లులు పడేలా చేస్తారు కొంతమంది.

అయితే దీపావళి రోజున టపాకాయలు పేల్చడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతోందని, అలా చేయవద్దని చెప్పినా ఏ మాత్రము పట్టించుకోరు సరికదా.. మా పండుగను చేసుకోవడానికే అభ్యంతరం చెప్తావా అంటూ ఆగ్రహించే వారుకూడా ఉన్నారు.

అయితే దీపావళి అనేది నరకాసుడిని సత్యభామ వధించనందుకు వచ్చిన పండుగ, లోక కంఠకుడైన నరకుడిని వధించి ప్రజలకు అతని చెర నుండి విముక్తి కలిగించింది కాబట్టి ద్వాపరయుగం నుండి ఈ పండుగను జరుపుకుంటున్నారు.

అయితే మన తాత ముత్తాతల కాలంలో వాయు కాలుష్యం ఇంతగా లేదు కాబట్టి వారు దీపావళి రోజున ఎన్ని టపాసులు కాల్చినా ఇబ్బంది అనిపించేది కాదు.

కానీ ప్రస్తుత అవసరాల దృష్ట్యా దేశంలో ఎన్నో కర్మాగారాలు పుట్టుకొచ్చాయి. అవి విడుదల చేసే కాలుష్యం,తోపాటు దీపావళి రోజున టపాసులు పేల్చడం వల్ల మరింత కాలుష్యం పెరిగిపోతోంది.

దీనిని కట్టడి చేయడానికి కొన్ని రాష్ట్రాలు నడుం బిగించాయి. అందులో ఒకటి రాజస్థాన్ రాష్ట్రం. ఆ రాష్ట్రం నుండి కొందరు వ్యక్తులు దీపావళి రోజున టపాసుల కాల్చడంపై నిషిద్దం విధించాలని కోరుతూ సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు.

వారు వేసిన పిటిషన్ ను ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. పీటీషనర్లు ఈ వ్యవహారంపై గతంలోనే వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ezgif 2 88b045c7c0 1 Firecrackers Ban Across Country : సుప్రీం కీలక ఆదేశాలు, దీపావళి రోజు టపాసుల మోత వద్దు,

దీంతో కేసును విచారించిన అత్యున్నత ధర్మాసనం దీపావళి తోపాటు ఇతర సందర్భాలలో బాణాసంచా పేల్చకుండా చూడాలని పేర్కొంది. తమ ఆదేశాలను అన్ని రాష్ట్రాలతోపాటు , కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా అమలయ్యే విధంగా చేయాలని ఆదేశించింది.

దీపావళి రోజున బాణా సంచా కాల్చడంపై గతంలో కూడా నిషేధం ఉంది. అయితే దానిని అంత కఠినంగా అమలు చేయలేదు, కాబట్టి ఆ నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రకృతిని కాపాడాలని పీటీషనర్లు కోరారు.

డిల్లీ లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఆదేశాలు కేవలం దేశ రాజధానికి మాత్రమే అని చాలా మంది భావించారు. అయితే ఈ తీర్పు దేశంలోని ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఒక్కరికీ వర్తిస్తుందని వారు ఈ పిటిషన్ ద్వారా మరోమారు గుర్తుచేశారు.

మరీ ముఖ్యంగా ఆస్పత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లోనైనా బాణాసంచా వినియోగం లేకుండా నిషేధం విధించాలని కోరారు.

అయితే చట్టాలను ప్రవేశ పెట్టి తీర్పులు ఇచ్చి ప్రజలను బలవంతంగా ఒప్పించేకన్నా, ప్రజలలో చైతన్యం తీసుకువస్తే అది మరింత సులువవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రజలకు ప్రకృతి పట్ల, భూమి కాలుష్యం పట్ల, వాయు కాలుష్యం పట్ల అవగాహన తీసుకురావడం ఎంతో ముఖ్య మని చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో సుప్రీం కోర్టు మరో విషయాన్ని ప్రస్తావించింది.

వాయు కాలుష్యం అనేది దీపావళి పండుగ తో మాత్రమే కాదని, పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల కూడా వాయు కాలుష్యం ఏర్పడుతుందని చెప్పింది .

పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో తక్షణమే పంట వ్యర్థాల కాల్చివేతను నిలిపివేయాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ విషయమై ఢిల్లీతో పాటు పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రతినిధులు సమావేశమవ్వాలని అందుకు తగిన చర్యలు సత్వరమే చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది.

కాబట్టి మాన్యవంతుగా మనం కూడా ఈ దీపావళికి బాణాసంచాను పక్కన పెట్టి దీపావళిని దీపాల వెళుతురులో చేసుకుని నిజమైన దీపావళి పండుగ చేసుకుందాం. పది మందికి ఆదర్శంగా నిలుద్దాం.

Leave a Comment