First Hindu Temple in Islamic Country – Abu Dabi : ప్రస్తుతం మన దేశం లో రామ నామం తో మారుమోగుతోంది. దీనికి కారణం దాదాపు 500 ఏళ్ళ నుండి ఏ ప్రభుత్వం చేయలేని పనిని B.J.P. ప్రభుత్వం ఎటువంటి మత గర్షణలు లేకుండా సామరస్య వాతావరణం లో అయోధ్య లో రామ మందిర నిర్మాణాన్ని చేపట్టి విజయ వంతంగా పూర్తి చేసింది.
మన దేశం లో హిందూ మెజారిటి ఉన్న అన్ని మతాలను ఒక తాటి పై తీసుకొచ్చి న్యాయ మార్గం లో ఆలయ నిర్మాణం చేపట్టింది. కాని మనం చెప్పుకోబోయే ఆలయం వివరాలు చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే ఈ ఆలయం నిర్మాణం చేపట్టింది మన దేశంలో కాదు, మత చాందస వాదం ఉన్న ఒక ఇస్లామిక్ దేశం లో, వినడానికి ఆశ్చ్యరం గా ఉన్న ఇది నిజం, అది ఎక్కడ అనుకుంటున్నారా, ప్రఖ్యాత టూరిజం కంట్రీ అయిన అబుదాబి లో, దాదాపు 700 కోట్ల ఖర్చు పెట్టి 108 అడుగుల ఎత్తు లో ఉండేలా నిర్మాణం చేపట్టారు. దీనికి మొత్తం రాతి ని ఉపయోగించి కట్టారు.
ఇంకా దీనిలో పింక్ రంగు రాళ్ళు తో పాలరాతి ని వాడారు. నిర్మాణ పనులు చూస్తే మాత్రం న భూతో న భవిష్యతి అన్నట్లు ఉంది. అంతే కాదు ఈ నిర్నానాకికి UAE ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోంది.
అంతే కాదు ఈ ఆలయ నిర్మాణం కోసం అబుదాబి ప్రభుత్వం 17 ఎకరాల స్ధలాన్ని ఇచ్చింది. ఈ ఆలయానికి 2017 లో మన భారత ప్రధాని చేతుల మీదుగా సంకుస్దాపన జరిగింది. మన దేశం లో ప్రముఖులు అందరు ఈ నిర్మాణ పనులలో తమ వంతు సహకారం అందించారు. ఈ నిర్మణానికి BAPS అనే సంస్ద భోచాసంవాసి అక్షర్ పుషోత్తం స్వామినారాయణ సంస్ద ముఖ్య భూమిక పోషిస్తోంది.
దీనికి ప్రపంచ వ్యాప్తం గా 1,100 దేవయలయ నిర్మాణాల నిర్మించే వారసత్వ సంస్కృతి ఉన్న అతి పెద్ద సంస్ద. ఈ సంస్ద ఆలయ నిర్మాణానికి అవసరమైన 700 కోట్లు పైగానే నిధులు సేకరించింది. ఈ ఆలయం ఈ సంవత్సరం ఫిబ్రవరి 14 న ప్రజలకి అందుబాటలోకి వస్తోంది. ఈ ఆలయం ఎవరి చేతులమీద ప్రారంభం అవుతుందనేది తెలియాల్సి ఉంది.