మొట్టమొదటి తెలుగు న్యూస్ రీడర్ గా శాంతి స్వరూప్ కొద్దిసేపటి క్రితం మరణిచారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు యశోద హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఆయనకు రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటు రావడం వల్ల హుటాహుటిన యశోదా హాస్పిటల్ కి తరలించారు. రెండు రోజుల నుండి ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతూనే కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు.
1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో మొదటిసారి ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. అయితే ఆ రోజులలో టెలి ప్రాంప్టర్ సహాయం లేకుండా వార్తలు చదవడం విశేషం. ఇలా ఆయన దాదాపు 10 సంవత్సరాలు చదివారు. అంతే కాదు ఆయన వార్తలు చదివే విధానం వల్ల తొలి న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని చెప్పవచ్చు. ఆయన 2011 సంవత్సరం లో పదవీ విరమణ చేసారు.
ఆయన రిటైర్ అయ్యేంత వరకు ఆయన వార్తలు చదువుతూనే ఉన్నారు, ఇది ఒక రికార్డ్ గానే చెప్పాలి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకోవడం విశేషం. శాంతిస్వరూప్ మృతి పట్ల పలువు రాజకీయ ప్రముఖులు, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేసారు. అంతే కాదు ఆయన భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా తెలుగు దూరదర్శన్ పని చేశారు. కొంత కాలం క్రితమే ఆయన భార్య అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరిగింది. శాంతి స్వరూప్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు.