BRS పార్టీ హిస్టరీలో ఫస్ట్ టైం..ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు.. ?

KTR KCR and Kavitha 1024x512 1 BRS పార్టీ హిస్టరీలో ఫస్ట్ టైం..ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు.. ?

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. తన రాజకీయ పార్టీకి ఏకంగా తెలంగాణ పేరే పెట్టుకున్నారు. ఆత్మగౌరవం అనే నినాదంతో ఎలాగైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉద్భవించింది. అయితే ఆపార్టీ పుట్టిన నాటి నుండి కేసీఆర్ కుటుంబం మొత్తం పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసింది. కేసీఆర్ కుమారుడు, కుమార్తె ఇద్దరు కూడా అమెరికాలో ఉద్యోగాలు విడిచిపెట్టి తండ్రి పెట్టిన పార్టీ పురోభివృద్ధి, తెలంగాణ సాధనకోసం పాటు పడ్డారు.

పార్టీ పెట్టిన నాటి నుండి కేసీఆర్ కి కుడి భుజంగా ఉన్న అల్లుడు హరీష్ రావు కూడా పార్టీకి మూల స్తంభంగా మారాడు. ఇక వీరి కుటుంబం పార్టీ ఆవిర్భావం నుండి వచ్చిన ప్రతి ఎన్నికలోనూ బరిలో ఉంటోంది. అవి బై ఎలక్షన్ అవచ్చు, లేదా సాధారణ ఎన్నికలు అవచ్చు. లోక్ సభ ఎన్నికలవచ్చు. ఏదైనా సరే పోటీ లో కల్వకుంట్ల ఫ్యామిలీ లేకుండా అయితే లేదు. కానీ పార్టీ పెట్టిన 23 ఏళ్ళ తరవాత మాత్రం ఒక చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. 2024 మే నెలలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ ఫ్యామిలీ దూరంగానే ఉంటోంది.

ఇప్పటికే కేసీఆర్ 17 లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ ను కూడా ప్రకటించేశారు. ఇప్పటివరకు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తున్న టాక్ ఏమిటంటే..లోక్ సభ ఎన్నికల బరిలో కేసీఆర్ నిలబడతారని, అయన తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో తన గళం వినిపించాలని భావిస్తున్నారని టాక్ నడిచింది.

ఇక కేసీఆర్ గారాల పట్టి కవిత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం తో ఆమె ఖచ్చితంగా లోక్ సభ ఎన్నికల బరిలో ఉంటారని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆమె 2014 లో నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి గెలిచారు, కానీ 2019 లో మాత్రం ఆమె ఓటమిపాలయ్యారు. ఈ దఫా ఆమె మరలా బరిలో నిలుస్తారని భావించినా ఆమె లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కటకటాలపాలయ్యారు. అయితే రిమాండ్ లో ఉన్నప్పటికీ నామినేషన్ వేసే అవకాశం ఉన్నప్పటికీ లిస్ట్ లో అయితే ఆమె పేరు లేదు.

ఇక కొన్నాళ్ల క్రితం కేటీఆర్ లేదా హరీష్ రావు వీరిలో ఎవరో ఒకరు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ అదీ జరగలేదు. అసలు కారణం ఏమిటన్నది తెలియనప్పటికీ ఈ ఎలెక్షన్ కి కేసీఆర్ ఫ్యామిలీ దూరంగా ఉంది అన్నది మాత్రం ఇప్పటివరకు నమ్మాల్సిన వాస్తవం. ఇప్పటివరకే అని ఎందుకు నొక్కి వక్కాణించాల్సి వచ్చింది అంటే ఇప్పటికి కేవలం అభ్యర్థుల లిస్ట్ మాత్రమే ఖరయింది, వారు నామినేషన్ వేయాలి, నామినేషన్ విత్ డ్రా గడువు ఉంటుంది, కాబట్టి ఈలోపు ఏమైనా జరగొచ్చు.

Leave a Comment