What the Fish first look: నీహారిక పుట్టినరోజు సందర్భంగా ఫిష్ ఫస్ట్ లుక్.
నాలుగేళ్ళకి మళ్ళీ తెరపైక ..2019 లో వచ్చిన సూర్యకాంతం, నీహారిక కొణిదెల చివరి చిత్రం. ఆ తరువాత నాలుగేళ్ల వరకు సినిమాలకు దూరంగా ఉంది.
మళ్ళీ ఇపుడు వాట్ ది ఫిష్ (What the Fish) అనే చిత్రంతో మళ్ళీ వెండి తరపై మెరవనుంది. నీహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఆ చిత్ర నిర్మాతలు విడుదల చేశారు.
ఈ పోస్టర్ లో నీహారిక ఒక వైట్ బెజవేల్డ్ డ్రస్ లో నడుస్తున్నట్టుగా ఉంటుంది, వెనకాల డాలర్ గుర్తు మెరుస్తూ కనపడుతుంది.ఈ సినిమాలో నీహారిక అస్తలక్ష్మీ ఆకాష్ పాత్రలో నటిస్తుంది.
ఈ సినిమాలో మంచు మనోజ్ నటిస్తున్నట్టుగా ఇంతకుముందు వెల్లడించాడు. ఆ తరువాత అతను మళ్ళీ ఈ సినిమా గురించి మాట్లాడలేదు. దానితో మంచు మనోజ్ ఈ సినిమా నుంచి వైదొలగాడని, నీహారిక చేస్తోందని వార్తలు వచ్చాయి,
దీనికి స్పందించిన చిత్ర బృంద సభ్యుడు, మంచు మనోజ్ సినిమా నుంచి తప్పుకోలేదని , అతనితో పాటు వెన్నెల కిశోర్ కూడా చేస్తున్నాడని వీళ్ళిద్దరూ త్వరలోనే ఈ ప్రొజెక్టు ముగించేందుకు కృషి చేస్తారని వెల్లడించాడు.
నీహారిక పెళ్లి సమయంలో మరియు విడాకుల సమయంలో వార్తల్లో నిలిచింది. తన భార్త చైతన్య తో 2020 డిసెంబర్ లో ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు.
తరువాత పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇటీవల నీహారిక అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యత్రిపాటి ని పెళ్లి చేసుకున్నాడు.వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో ఈ వాట్ ది ఫిష్ సినిమా రాబోతుంది.