రాబోయే 5 రోజులు తెలంగాణా ప్రాతం లో ఎండలు అగ్ని గుండం లా ఉంటుంది

are you prepared to manage older peoples health during heatwaves రాబోయే 5 రోజులు తెలంగాణా ప్రాతం లో ఎండలు అగ్ని గుండం లా ఉంటుంది

ఇంకా సమ్మర్ రాలేదు అప్పుడే సూర్యడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. శివరాత్రి వెళ్తే కాని ఎండలు ప్రారంభం అవ్వవు అంటారు. కాని ఈ సారి ఫిబ్రవరి మొదటి వారం నుండే ఎండలు మొదలు అయ్యాయనే చెప్పాలి. ఆల్రెడీ తెలంగాణా లో 37 డిగ్రీలు టెంపరేచర్ ఉంటోందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని దాదాపు 40 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి దృష్ట్యా ఈ సారి ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని చెప్తోంది. వరుసగా గత రెండు రోజులు గా చూస్తే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దగ్గరగా చేరుకున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణా పౌరులు చాల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.

Leave a Comment