ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాజీ మంత్రి కొడాలి నాని పలు సంచలన వ్యాఖ్యలు.

website 6tvnews template 2024 03 27T140211.474 ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాజీ మంత్రి కొడాలి నాని పలు సంచలన వ్యాఖ్యలు.

కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. అవే ఇప్పుడు మెగా సిటీలుగా మనకు కనపడుతున్నాయని చెప్పారు.AP రాజధాని పై కొడాలి నాని నిన్న గుడివాడలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశం లో ఉన్న అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయని అవి ఈరోజు పెద్ద పెద్ద మెగా సిటీ లు మారి పెద్ద పెద్ద MNC లు రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

కాని పొలాల్లో మనం రాజధానిని నిర్మించలేము కదా ఆ విషయం చంద్రబాబు నాయడు కి తెలియద, ఆయన కి వాస్తవాలు తెలియదా అని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని కోసం రైతులు ఎం అంతే త్యాగం చేయలేదని అంటూ చాల ఘాటు గా విమర్శించారు. పెద్ద పెద్ద రాజధానులు ఉన్న ఈ దేశం లో ఏ రాజదానికైన 150 ఎకరాలు ప్రభుత్వానికి సంబందించిన ఆఫీసులు ఉంటాయని ఆయన చెప్పారు.

మిగిలిన ఖాళి జాగాలు ప్రైవేట్ ఆస్తులుగా చూడాలి అని ఆయన చెప్పారు. అంతే కాదు అతి పెద్ద రాజధానిని నిర్మిస్తామని రైతుల వద్ద 33 వేలు ఎకరాలు తీసుకుని ఎం వేలగాబెట్టారో అందరికి తెలుసు అని ఆయన ఎద్దేవా చేసారు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఏ సమస్య అయిన తొందరగా పరిష్కారం అవ్వాలంటే దానికి జగనే ముఖ్యమంత్రి గా ఉండాలి అని ఆయన అన్నారు.

దానికి అంటూ ఒక ప్రత్యేక వవస్డ తీసుకొచ్చిన ఘనత జగన్ దే అని ఆయన అన్నారు.చంద్ర బాబు, జగన్ లలో ఎవరు మంచి ప్రజా పాలన అందిస్తారో మీరే ఆలోచించుకోవాలి అని ఆయన అన్నారు. 120 సార్లు ఒక్క బటన్ నొక్కి పేద ప్రజల అకౌంట్ లో డబ్బులు వేసిన ముఖ్యమంత్రి లాంటి ఎక్కడైనా చూసారా అంటూ ఆయన జగన్ ని పొగడ్తలతో అభినందించారు. రాష్ట్రాన్ని ఏల అభివృద్ది చెయ్యాలో ఒక్క జగనే తెలుసు అని ఆయన అన్నారు. ఈ సారి కుడా ఆయనే ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన అన్నారు.

Leave a Comment