దసరాకు బాక్సాఫీస్ బద్దలేఒకేసారి నాలుగు క్రేజీ మూవీస్

website 6tvnews template 2024 03 05T105810.888 దసరాకు బాక్సాఫీస్ బద్దలేఒకేసారి నాలుగు క్రేజీ మూవీస్

Four big movies to be released in the 2024 Dusshera festival season Dusshera 2024 : టాలీవుడ్‏లో సంక్రాంతి తర్వాత అతి పెద్ద సీజన్ సమ్మర్. అయితే వేసవిలో ఈసారి పెద్ద హీరోల హంగామా పెద్దగా కనిపించడం లేదు.

ఏపీలో ఎన్నికలు ఉండటంతో పాటు ఐపీఎల్ క్రికెట్ టోర్నీ జరుగుతుండటంతో ఫిల్మ్ మేకర్స్ ఈ వేసవిలో సినిమాల విడుదలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ‘కల్కి2898AD’ (Kalki2898AD) ఒక్కటే ఈ సమ్మర్ లో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యింది.

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nagashwin ) డైరెక్షన్ లో వస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ భారీ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా కొన్ని నెలల క్రితమే ప్రకటించారు.

ఇక ఈ సమ్మర్ లో బడా ఫిల్మ్ వార్ లేకపోండంతో నిర్మాతలు దసరా దసరా బరిలోకి దిగుతున్నారు. దసరాకు ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. పవన్కల్యాణ్(Pawan Kalyan) , జూ.ఎన్టీఆర్(Jr. NTR), అక్కినేని నాగచైతన్య(Akkineni Naga chaitanya ) లాంటి ముగ్గురు స్టార్ హీరోలు విజయ దశమి(Vijayadasami )కోసం కర్చీఫ్స్ వేసుకున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) కూడా 2024 ఫెస్టివల్ రేసులోకి దిగుతున్నట్లు సమాచారం.

సెప్టెబర్ 28న OG :

Pawan Kalyan OG Movie Producer funny chat with fans gone viral దసరాకు బాక్సాఫీస్ బద్దలేఒకేసారి నాలుగు క్రేజీ మూవీస్


సుజీత్ (Sujith )డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )హీరోగా తెరకెక్కుతోన్న మూవీ ఓజీ(OG). ఈ యాక్షన్ థ్రిల్లర్ ను డీవీవీ దానయ్య(Dవ్ Danayya) నిర్మిస్తున్నారు. ఓజీ మూవీ సెప్టెబర్ 28న రిలీజ్ కాబోతోంది. రిలీజ్ విషయంలో పవన్ ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi ) సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు.

అందుకే అదే డేట్ కు తీసుకురావాలని మేకర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. దసరా రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ వసూలు చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. పవన్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ లో బిజీ గా ఉన్నారు. ఇంకో రెండు వారాల డేట్స్ ఇస్తే ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ తో మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి.

ఏప్రిల్ 5న దేవర :

NTRs Devara To Release In Two Parts e1696419048532 దసరాకు బాక్సాఫీస్ బద్దలేఒకేసారి నాలుగు క్రేజీ మూవీస్

ఆర్ఆర్ఆర్ (RRR) తరువాత జూ.ఎన్టీఆర్(Jr. NTR) చేస్తున్న మూవీ దేవర(Devara). ఈ మాస్ యాక్షన్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ (Janhvi Kapoor ) ఎంట్రీ ఇస్తోంది.

‘దేవర ‘ను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ను మొదట ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలనుకున్నారు. చివరకు అక్టోబర్ 10న డేట్ ఫిక్స్ చేశారు. దసరా టార్గెట్ గానే ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే బయటకి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

అక్టోబరు 11న తండేల్ :

thandel దసరాకు బాక్సాఫీస్ బద్దలేఒకేసారి నాలుగు క్రేజీ మూవీస్

అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘తండేల్'(Thandel ). గీతా ఆర్ట్స్ బ్యానర్(Geetha Arts Banner ) లో బన్నీ వాసుBunny Vasu)ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని దసరా నాటికి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. అక్టోబరు 11న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ (Balakrishna ) హీరోగా బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ NBK109. ఈ వర్కింగ్ టైటిల్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్ లో ఈ మాస్ యాక్షన్ మూవీని దసరాకే విడుదల చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 3న సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట . ఇప్పటికైతే ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే బాలయ్య దసరా సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

Leave a Comment