
RGI Air Port : శంషాబాద్ నుండి నాలుగు కొత్త సర్వీసులు..
భారతదేశంలోని అతి పెద్ద విమానాశ్రయాల్లో శంషాబాద్ విమానాశ్రయం కూడా ఒకటి. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ బాగా రద్దీ గా ఉండే ఎయిర్పోర్ట్.
ఈ ఎయిర్ పోర్ట్ నుండి ప్రపంచం లోని అనేక దేశాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కేవలం ఇంటర్నేషనల్ విమానాలు మాత్రమే కాదు మన భారత దేశం లోని అనేక ముఖ్య పట్టణాలకు ఇక్కడి నుండి విమానాలు నడపబడతాయి. వాటినే డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటారు.
ఇది ఇలా ఉండగా ఆర్జీఐ లో ఇటీవలి కాలంలోనే కొత్త టెర్మినల్ ను కూడా ప్రారంభించి ప్రయాణికులకు అదనపు సౌకర్యాలను అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటె శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మరో నాలుగు విమాన సర్వీసులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చేశాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ సహకారంతో ఈ విమానాలు ఇక్కడి నుండి టేకాఫ్ కానున్నాయి. ఈ విమానాలు కొచ్చి, గ్వాలియర్, అమృత్‌సర్, లఖ్‌నవూల మధ్య రాకపోకలను
సాగించనున్నాయి. నవంబర్ 17వ తేదీ నుండి అమృత్‌సర్, లఖ్‌నవూ, కొచ్చిలకు సేవలను లాంఛనంగా ప్రారంభించారట. ఈ విషయాన్నీ GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ స్వయంగా పేర్కొన్నారు.
శంషాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రోజూ ఉదయం 7 గంటల.30 నిమిషాలకు బయలుదేరి 10 గంటల.15 నిమిషాలకు అమృత్‌సర్‌కు చేరుకుంటుంది.
శంషాబాద్ నుంచి కొచ్చికి వెళ్లే విమానం సాయంత్రం 7 గంటల.45 నిమిషాలకు టేకాఫ్ అయ్యి రాత్రి 9 గంటల.30 నిమిషాలకు ల్యాండ్ అవుతుందట.
ఇక లఖ్‌నవూ వెళ్లే విమానం శంషాబాద్ లో మధ్యాహ్నం 2.గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయ్యి సా.4 గంటల.35 నిమిషాలకు రీచ్ అవుతుంది. మరో వైపు శంషాబాద్-గ్వాలియర్‌ల మధ్య వారానికి మూడు సర్వీసులుంటాయని అంటున్నారు అధికారులు.
ఈ విమానం కూడా మధ్యాహ్నం రెండున్నరకే టేకాఫ్ అవుతుంది, కానీ సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాలకే ల్యాండ్ అవుతుంది.