‘SAINDHAV’ Pre Release Event: ఒకే వేదికపై మెరవనున్న నలుగురు సీనియర్ నటులు.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఈ నలుగురు టాలీవుడ్ కి ద్వాజ స్తంబాల లాంటి వారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం అగ్రహీరోలు వీళ్ళే.
అయితే వీళ్ళ నలుగురిని ఒకే వేదిక పైన చూడటం చాలా అరుదు.అప్పుడెప్పుడో జరిగిన వజ్రోత్సవాలలో ఈ నలుగురిని ఒక దగ్గర చూశాం కానీ ప్రస్తుత కాలంలో అది జరగలేదు.
ఇద్దరిద్ధరూ వచ్చారు కానీ, నలుగురు ఒకదగ్గర మాత్రం కనపడలేదు.ఇటీవల జరుగుతున్న కొన్ని చర్చల ప్రకారం చూస్తే వీళ్ళు నలుగురు ఒకే వేదికపై కనపడే అవకాశం తొందరలోనే రావొచ్చు, అదెలాగంటే,
SAINDHAV PRE RELESE EVENT :
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75 వ చితం SAINDHAV.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగనుంది. ఇది వెంకటేష్ కి 75 వ చిత్రం కావడం వల్ల అతనికి ఇది చాలా ప్రత్యేకం.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా ప్రత్యేకంగా నిర్వహించాలని సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.
ఈ క్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కానున్నారని సమాచారం.
వీరితో పాటు వెంకటేష్ తో ప్రత్యేక అనుబంధం ఉన్న యంగ్ హీరోలో కూడా రానున్నారు.
సైంధవ్ :
సైంధవ్ అనేది వెంకటేష్ కెరీర్ లో ముఖ్యమైన చిత్రం, ఇది ఆయన 75 వ చిత్రం.నీహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకం పైన వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, ఆండ్రియా జారెమియా, శ్రద్దా శ్రీనాథ్ మరియు రుహాని శర్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు.