ఉచితం గా ఆధార్ అప్ డేట్ – గడువు పొడిగించిన కేంద్రం.

5b44e4 ad446295bd76433396fb580e521c4631mv2 1 ఉచితం గా ఆధార్ అప్ డేట్ - గడువు పొడిగించిన కేంద్రం.

భారత దేశం లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఇప్పుడు ఆధార తప్పని సరి చేసింది కేంద్రం. అంతేకాదు కొన్ని పధకాలు పొందడానికి ఆధార్ కార్డు ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

కాని ఆధార్ కార్డు లో పేరు తప్పుగా ఉండడమో లేదా వారి ఇంటి అడ్రస్ మారడమో అయితే వెంటనే మీ సేవ సెంటర్ కి వెళ్ళి మన వివరాలు లేటెస్ట్ గా ఉండేటట్లు అప్ డేట్ చేయించుకోవాలి. దేనికైనా దరఖాస్తు చేసుకోవాలన్న ఈ ఆధార్ కార్డు ఉండాలి.

ముఖ్యం గా రెసిడెన్స్ ప్రూఫ్ గా ఈ ఆధార్ కార్డు బాగా ఉపయోగపడుతుంది. మీ వివరాలు నమోదు చేయించుకునే మీ సేవ కేంద్రం లో కొంత రుసుము కుడా కట్టాలి. కాని అది అందరికి సాధ్యపడదు. కొందరికి సాధ్యపడిన వారు తమ సొంత వివరాలు అప్ డేట్ చెయ్యలేరు.

దీనికి కారణం ఆధార్ నమోదు చేసుకునే వెబ్ సైట్ లో మన వివరాలు ఎంట్రీ చెయ్యలేము. అది కేవలం వెబ్ సైట్ నిర్వాహకులు మాత్రమే చెయ్యగలుగుతారు. కాని మీ సేవ సెంటర్ ల మీద ఒత్తిడి పెరగడం వల్ల ఇప్పుడు కేంద్రం కంప్యూటర్ లు ఉన్నవారు వారి ఇంటి నుండే ఆధార్ అప్ డేట్ చేసుకోవాడానికి వెబ్ సైట్ ను మనమే లాగిన్ చేసుకోవచ్చు. అయితే దీనికి కేంద్రం మార్చి 14 వరకు గడువు ఇచ్చింది.

అయితే రాబోయే రెండు రోజుల్లో గడువు ముగుస్తుంది. ఆ తర్వాత మీ సేవ సెంటర్ కే వెళ్ళాలి. కాని ఆధార్ నమోదు చేసుకోవడానికి కేంద్ర మరొక సారి గడువు పెంచింది. దీని కోసం మరో 3 నెలలు గడువు పెంచుతున్నట్లు ఉడాయ్ X లో పోస్ట్ చేసింది. ఈ గడువు వల్ల జూన్ 14 వరకు ఆధర్ ను ఉచితం గా అప్ డేట్ చేసుకోవచ్చు.

Leave a Comment