Free travel for women in RTC: ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎవరు అర్హులు అవుతారంటే.
తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించింది. అందులో ఆడవారికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కూడా ఒకటి. ఈ అయితే ఈ పధకాన్ని అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో అధికార పగ్గాలు చేపట్టింది.
ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు అందుకున్నారు. ఈ క్రమంలో ముందుగా చెప్పినట్టు డిసెంబర్ 9వ తేదీ నుండి ఆర్టీసీ లో ఆడవారికి ఉచిత ప్రయాణం అనే పథకాన్ని అమలు జరపాలని నిశ్చయించారు.
అయితే ఈ పధకానికి ఎవరు అర్హులు అవుతారు ? తెలంగాణ లో ఉండే అందరు ఆడవారు ఆర్హులేనా ? లేదంటే తెలంగాణా ఆడబిడ్డలకు మాత్రమే అర్హత ఉంటుందా ? ఆ విషయాన్నీ పక్కన పెడితే ఈ సదుపాయం ఏయే బస్సులో వర్తిస్తుంది ?
ఏ బస్సు ఎక్కినా ఉచిత ప్రయాణమేనా ? లేదంటే కొన్ని బస్సులకు మాత్రమే ఇది పరిమితం అవుతుందా ? అసలు ఈ పధకాన్ని అమలు చేయాలంటే ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది ?
ఇప్పటికే గత సర్కారు ఆర్టీసీని ప్రభుతం లో విలీనం చేస్తుంది అని వార్తలు వచ్చాయి, మరి విలీనం జారీడిందా ? ఆగిందా ? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పధకం అమలు చేయడానికి తెలంగాణ లో ఉన్న బస్సుల సంఖ్య సరిపోతుందా ? ఇటువంటి ప్రశ్నలు సామాన్యుల మదిలో మెదులుతున్నాయి.
ఇవి సామాన్యులకు మాత్రమే కాదు ఆధాయకారులకు కూడా ఉత్పన్నం అయ్యే ప్రశ్నలే, అందుకే ఇప్పటికే ఈ పధకాన్ని అమలు చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అధ్యయనం చేయనున్నారు. ఈ పధకాన్ని ఎలా అమలు చేస్తున్నారు, ఏయే బస్సుల్లో అమలవుతోంది వంటి సందేహాలను అక్కడి అధికారులతో మాట్లాడి నివృత్తి చేసుకుంటున్నారు.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఎంత మేర భారం మోయాల్సి ఉంటుంది అని. తెలంగాణ నుండి వెళ్లిన అధికారులు ఆ వివరాలను టీఎస్. ఆర్టీసీ ఎండి సజ్జనార్ కు తెలియజేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ లో 8వేల పైచిలుకు బస్సులు ఉంటె కర్ణాటక ఆర్టీసీ లో 22 వేల బస్సులు ఉన్నాయి. కర్ణాటలో ఈ పధకం అమలు చేయడం మొదలు పెట్టిన తరువాత 55 శాతం మహిళలతో బస్సు నిండుతుంటే 45 శాతం పురుషులతో నిండుతోంది.
ఈ పధకం ప్రారంభించక ముందు చుస్తే 40 – 41 శాతం మాత్రమే ఉండేది. మహిళలకు ఉచిత ప్రయాణం పధకం అమలు పరిచిన తరువాత కర్ణాటకలో మహిళల ప్రయాణం 55 శాతానికి చేరుకుంది. అంటే దాదాపు 15 శాతం పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
కర్ణాటక లో చోటుచేసుకున్న పరిణామాలను బట్టి చుస్తే తెలంగాణ లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది.
ఇక కర్ణాటకలో మహిళలు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సర్వీసులలో కూడా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ పధకానికి కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు మాత్రమే అర్హులు, పైగా ఆ ప్రయాణాలు రాష్ట్ర పరిధిలో వరకు మాత్రమే ఉండాలి. రాష్ట్రం దాటితే చార్జీలు చెల్లించక తప్పదు.
ఇక తెలంగాణ ఆర్టీసీ విషయానికి వస్తే ఆర్టీసీ ద్వారా సంస్థకి, రోజుకి 14 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయితే మహిళా ప్రయాణికుల శాతం 40గా ఉంది.
మరి ఇప్పుడు వీరందరికి ఉచితాన్ని అమలు చేస్తే సంస్థకి నాలుగు కోట్లకి పైగా ఆదాయం గండి పడుతుంది. పైగా ఉచిత ప్రయాణం అంటే మెట్రోల్లో ప్రయాణించే వారు కూడా కాస్త ఆలస్యమైనా పర్లేదు అని బస్సులనే ఉపయోగించే ఛాన్స్ కూడా ఉంది.
ఈ అధ్యయనాలన్నిటిని మేళవించి మన రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం ఎలా అమలు చేయాలి అన్నదానిపై నిర్ణయం తీసుకోవడానికే ఒక సమీక్షా సమేవేశం నిర్వహిస్తారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ తప్పక హాజరు కానున్నారు.
ఈ సమావేశం అనంతరం తెలంగాణ లో ఈ పధకానికి ఎవరెవరు అర్హులు, ఆర్టీసీ బస్సులో ఉచితం అమలు కావాలంటే ఏవైనా గుర్తింపు కార్డులు చూపెట్టాలా అక్కర్లేదా, ఏయే బస్సుల్లో ఉచితం అమలులో ఉంటుంది అనే వివరాలు వెల్లడవుతాయి.