French president gives bumper offer to Indian : భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు(Republic Day Celebrations of India) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్(Emmanuel Macron) ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం విదితమే.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర వేడుకలు దేశ భక్తిని చాటాయి. ఇక ఈ వేడుకల సందర్భంగా మక్రాన్ భారతీయ విద్యార్థులకు శుభవార్త అందించారు.
అదేమిటంటే రాబోయే రోజుల్లో ఫ్రాన్స్(France) కి భారతీయ విద్యార్థులను మరింత ఎక్కువ మందిని ఆహ్వానించడానికి సంసిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఉన్నత విద్య నిమిత్తం ఫ్రాన్స్ వచ్చే భారత విద్యార్థులకు అక్కడ ఫ్రెంచ్ భాష నేర్చుకోవడానికి ప్రత్యేక తరగతులను కూడా ఏర్పాటు చేసేలా చూస్తామని చెప్పారు.
ఇక 2030 నాటికి భారత్ నుండి ఫ్రెంచ్ కి 30 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్య నిమిత్తం వచ్చేలా టార్గెట్ పెట్టుకున్నామని పేర్కొన్నారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడికి మోదీ గిఫ్ట్ : Modi’s gift to the French President
ఇక భారత్ కి విచ్చేసిన మెక్రాన్ కి దేశ ప్రధాని మోదీ ఒక అపురూప కానుకను అందించారు. హస్తకళల దుకాణాన్ని సందర్శించిన సమయంలో అక్కడ చెక్కతో తయారు చేసిన అయోధ్య రామ మందిర నమూనా Model of Ayodhya Ram temple నేతల కంట పడింది.
వెంటనే మోదీ(PM Modi) దానిని కొని ఫ్రెంచ్ అధ్యక్షుడిని బహుకరించారు. ఆతరువాత వారు ఒక టీ దుకాణం వద్ద టీ సేవించిన అనంతరం ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు.
అయితే జనవరి 25వ తేదీన జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ల్యాండ్ అయినా ఫ్రెంచ్ అధ్యక్షుడు అక్కడ చారిత్రాత్మక కట్టడాలను సందర్శించారు.