Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

website 6tvnews template 76 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 : ఎట్టకేలకు 500 ఏళ్ళ నాటి కల ఫలించింది, అత్యంత వైభంగా, ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పూర్తయింది. ముఖ్య అతిధిగా హాజరైన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అయన సువర్ణ హస్తాలతో బాల రాముడి విగ్రహాన్ని ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించారు.

వేద పండితులు నిర్ణయించిన శుభలగ్నంలో శాస్త్రోక్తంగా పండితులు మంత్రాలను ఉచ్చరిస్తున్న వేళ ఈ క్రతువు పూర్తయింది. లక్షల సంఖ్యలో భక్తులు అయోధ్యకు వెళ్లి ఈ కార్యక్రమాన్ని ప్రతక్షంగా వీక్షించారు. అలాగే యావత్ భారత దేశంలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా వీక్షించి తరించారు.

బాబర్ ఆస్థాన కమాండర్ ఏంచేశాడు : What did Babur’s court commander do?

130437 uwtwhztyxk 1572976034 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

అయితే ఈ రామ మందిరం వెనుక ఉన్న కథ ఏంటి, 1528 వ సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు ఎం జరిగింది.

అన్నది ఒక్కసారి చూద్దాం. మొఘల్ చక్రవర్తి బాబర్ ఆస్థానంలో కమాండర్ గా పనిచేసే మీర్ బాకీ అనే వ్యక్తి 1528వ సంవత్సరంలో బాబ్రీ మసీదు నిర్మాణాన్ని చేపట్టడం వల్లనే రామ మందిర ఉద్యమం ఊపిరిపోసుకుంది.

ఈ బాబ్రీ మసీదును ఆనతి పాలకుల హయాంలో, హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించబడిందనేది వారి నమ్మకం. అందుకే ఎన్నో దశాబ్దాలపాటు రెండు వర్గాల మధ్య చర్చలు జరిగాయి, ఆ చర్చలు విఫలం అవ్వడంతో ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

బల్బీర్ పుంజ్ పుస్తకంలో ఏముంది : What is in the book of Balbir Punj

భారతీయ జనతా పార్టీ కి చెందిన ఒక రచయిత, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు అయిన బల్బీర్ పుంజ్ ఒక పుస్తకాన్ని రచించారు. తన రచనలో ‘ట్రైస్ట్ విత్ అయోధ్య: డీకోలనైజేషన్ ఆఫ్ ఇండియా’ అనే వ్యాసంలో ఎం చెప్పారంటే, మరాఠాలు అయోధ్య, కాశీ తోపాటు మథుర పై పట్టు సాధించాలని ఆనాడు కోరుకున్నారని రాసుకొచ్చారు.

నిహాంగ్ సిక్కులు ఎం చేశారు : What Nihang Sikhs did

657ee3abb412c 20231217 170354627 16x9 1 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

ఇక 1858 సమయంలో, నిహాంగ్ సిక్కులు బాబ్రీ మసీదును రాముడి జన్మస్థలంగా ప్రకటించే ప్రయత్నం చేశారు. అయితే దాని వల్ల అసలే వివాదాస్పదంగా ఉన్న స్థలంపై నియంత్రణ సాధించడం కోసం ఇరు వర్గాల్లో పట్టుదల పెరిగింది.

ఆ పట్టుదలే పోరాటానికి బీజం పడేలా చేసింది, రాబోయే సంఘర్షణలను సూచిస్తుంది. భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో సంచలన తీరును ఇచ్చింది, 2019వ సంవత్సరంలో ఇచ్చిన ఆ తీర్పు చరిత్రలో నిలిచిపోయింది అని చెప్పొచ్చు.

నిహాంగ్ బాబా ఫకీర్ సింగ్ ఖాల్సా, 25 మంది నిహాంగ్ సిక్కులతో కలిసి మసీదు ఆవరణలోకి చొరబడి, మసీదు ఉన్న ప్రదేశం రాముడి చారిత్రాత్మక జన్మస్థలమని వాదించారని పేర్కొంది.

మొట్టమొదటి కేసు నమోదైంది అప్పుడే : The Riot Was Filed On That year

babri masjid Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

ఈ కేసుల విషయానికే వస్తే మొట్టమొదట న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వ్యక్తిని గుర్తు చేసుకోవాలి. అయన పేరు నిర్మోహి అఖారా పూజారి రఘుబర్ దాస్ 1885లో మసీదు బయటి ప్రాంగణంలో ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ అయన కోర్ట్ లో పిటిషన్ వేశారు.

ఇక ఆనాడు బ్రిటిష్ పరిపాలన కొనసాగుతోంది, అయోధ్య నగరంలోని హిందువులు అలాగే ముస్లింల ఏదైతే తమదంటే తమదని వాదిస్తున్నారో ఆ ప్రార్థనా స్థలాలను గుర్తించే స్థలం చుట్టూ కంచె వేసింది బ్రిటిష్ సర్కారు.

అప్పుడు వేసిన కంచె దాదాపు 90 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయింది.

రాత్రి సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచారా ? Lord Rama Idol Kept In Night Time ?

649803 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

అది 1949 వ సంవత్సరం డిసెంబరు 22వతేదీ. రాత్రి సమయంలో బాబ్రీ మసీదు లోపల ‘రామ్ లల్లా’ విగ్రహాలను ఉంచారు, అలాగే ఆ స్థలం చుట్టూ మతపరమైన భావాలను ప్రేరేపించారు.

మొత్తంగా ఈ చర్యలు ఆ యాజమాన్యంపై న్యాయ పోరాటాలకు దారితీసింది. ఈ స్థలం తమదంటే తమది అంటూ కేసులు వేసుకునేలా చేసింది.

అప్పుడు ముపాదాలైన కేసులు తరువాతి దశాబ్దంలో ఇంకా పెరిగాయి. నిర్మోహి అఖారా విగ్రహాలను పూజించే హక్కులను కోరుతూ కేసులు వేయగా, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరింది.

ఆనాటి కాంగ్రెస్ చర్యల వల్ల జరిగింది ఏమిటి ? What happened with congress government decision

1200px Rajiv Gandhi meeting Ru Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

ఇక 1986లో, కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నేతృత్వం వహించిన కేంద్ర సర్కారు. బాబ్రీ మసీదు తాళాలు తెరిచి, హిందువులు లోపల పూజలు చేయడానికి అనుమతించింది.

అయితే ఆనతి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్రిక్తతలను మరింత పెంచింది. రగులుతున్న అగ్నిలో ఆజ్యం పోసినట్టయింది పరిస్థితి. ఇది రామ జన్మభూమి విషయంలో చాలా కీలకం గా మారింది. 1992 సంవత్సరం ఒక ఈ బాబ్రీ మసీదు విషయంలో పతాక స్థాయి సన్నివేశం అని చెప్పుకోవాలి.

ఆ ఏడాది బాబ్రీ మసీదు కూల్చివేతకి సాక్షీ భూతంగా నిలిచింది. హిందూ కార్యకర్తలు మసీదును ధ్వంసం చేశారు. తదనంతర కాలంలో జరిగిన అల్లర్లు భారత దేశ రాజకీయాలను శాశ్వతంగా మార్చేశాయి.

లిబర్‌హాన్ కమిషన్ తో ఏమైంది ? What Happend With Liberhan Report

Babri masjid demolition liberhan commission.pdf 1 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

16 సంవత్సరాలలో 399 సిట్టింగ్‌లు నడిచాయి, ఆ తర్వాత, లిబర్‌హాన్ కమిషన్ తన నివేదికను సమర్పించింది, బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన క్లిష్టమైన వివరాలను వెల్లడించింది. తద్వారా కీలక నేతలను అందులో ఇరికించింది.

లిబర్‌హాన్ కమిషన్ 2009వ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది. లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి తోపాటు ఇతర బిజెపి నాయకుల పేర్లను చేర్చింది.

ఈ విధారణను దాదాపు 17 సంవత్సరాల తర్వాత ప్రారంభించింది.

శంకుస్థాపన చేసిన మోదీనే విగ్రహ ప్రతిష్ట చేశారు : Modi Laid Foundation Stone And Inaugurated Temple

modi ram temple Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

రామ మందిరం విషయంలో 2019 గుర్తుండిపోతుంది. ఈ కేసులో తీర్పుకి సంబంధించి ఆ ఏడాది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది, రామ మందిర నిర్మాణం కోసం మొత్తం వివాదాస్పద భూమిని హిందువులకు అప్పగించింది సుప్రీంకోర్టు, అలాగే మసీదు నిర్మానంకోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించింది.

దీంతో సమస్య పరిష్కారం కావడం తో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. ఆలయ నిర్మాణం కోసమే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. అది ఆలయ నిర్మాణాన్ని మరింత సుగమం చేసింది.

వివాదాల తెరను తెంచుకుని బయటపడటం ఆలయ నిర్మాణం సాఫీగా జరిగిపోవడంతో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీనే ఆలయం లో రఘునందనుడైన బలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

2024 Ram Mandir inauguration:

Ram Temple in Ayodhya 1705838563493 1705838563927 Full 500 Year stories of Ayodhya conflict from 1528 to 2024 :అయోధ్య వివాదంలో 1528 నుండి 2024 వరకు జరిగింది ఏమిటి.

Leave a Comment