G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

When did G20 start, what are the benefits of G20, what kind of things will be discussed in G20

G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

G-20.. G-20.. G-20.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మాటే వినిపిస్తోంది, భారత ప్రభుత్వం దీనిని అంత ప్రతిష్టామకంగా తీసుకుని నిర్వహించడానికి కారణం ఏమిటి ?

అసలు G-20 అంటే అర్ధం ఏమిటి ? G-20 అనేది ఎప్పడు మొదలైంది ? దీని కార్యాలయం ఎక్కడ ఉంది ? దీనిని నడిపించేది ఎవరు ? అసలు G-20 అనేది ఎప్పుడు ఎక్కడ మొదలైంది ? దీనిని మొదలు పెట్టడానికి ముఖ్య కారణాలు ఏంటి ?

అన్నిటికి మించి మన భారత దేశానికి ఈ G-20 కి సంబంధం ఏంటి ? అనే సందేహాలు ఉన్నాయి, అన్నిటికి మించి ఈ G-20 లో ఎటువంటి చర్చలు జరుగుతాయి ? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే సందేహాలు సామాన్యుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. అందుకే ఒక్కసారి ఈ G-20 గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

G-20 ఎప్పుడు మొదలైందంటే:

Add a heading 2023 11 30T145534.073 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

ఈ G-20 అనేది 1999 లో మొదలైంది, అయితే ఇది 1999 లోనే మొదలవడానికి ఒక కారణం ఉంది, 1997వ సంవత్సరంలో ఆసియాలో ఆర్ధిక సంక్షోభం తలెత్తింది.

ఈ సంక్షోభం వల్ల అనేక దేశాలు ప్రభావితం అయ్యాయి. కాబట్టి ఆర్ధికంగా దెబ్బతిన్న దేశాలు అందులోను బలమైన దేశాలు అన్ని కలిసి ఒక కూటమిగా ఏర్పడాలని నిర్ణయించాయి. వాటిలో మన భారత దేశం కూడా ఒకటి.

ప్రస్తుతం మన భారత దేశంతో కలిపి మొత్తం 20 దేశాలు ఈ G-20 లో ఉన్నాయి. ఈ G-20 ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.

అవును, మీరు ఊహించింది నిజమే, ఆసియా లో ఆర్ధికంగా నష్టపోయిన దేశాలకు చెందిన ఆర్ధిక మంత్రులు, ఆదేశ అధ్యక్షులు, ఉన్నతాధికారులు, ఆర్ధిక నిపుణులు అందారు కలిసి చర్చిస్తారు. ఆ చర్చల్లో దేశ ఆర్ధిక వ్యవస్థలను ఎలా బలోపేతం చెయ్యాలి, ఆర్ధిక మద్యం వల్ల తలెత్తే ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలను చర్చిస్తారు.

ఆనాడు బెర్లిన్ లో:

Add a heading 2023 11 30T143129.016 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

ఇక మొట్ట మొదటిసారిగా ఈ G-20 సమ్మిట్ ను బెర్లిన్ దేశంలో నిర్వహించినట్టు చెరిత్ర చెబుతోంది. అర్జటినా , ఆస్ట్రేలియా , బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, కొరియా, సౌత్ మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్ డం, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు ఈ సమ్మిట్ లో పాల్గొన్నాయి.

ఆసియాలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న కారణంగా అనేక దేశాలు ఆ ప్రభావాన్ని ఎదుర్కొనక తప్పలేదు.ఆసియాలో కొన్ని దేశాలు ఆర్ధిక సంక్షోభం వద్ద దెబ్బతింటే, ఆ ప్రభావం మరికొన్ని దేశాల ఆర్ధిక స్థితి పై కొంత మేర ప్రభావాన్ని చూపింది.

దీంతో పైన పేర్కొన్న దేశాలన్నీ ఏకమై సంక్షోభం పై చర్చను చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. అలా ప్రపంచం లోని దేశాలన్నీ ఒకే గొడుగు కిందకి వచ్చి సంక్షోభం పై చర్చను చేపట్టాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి, అలాగే భవిష్యత్తు సంక్షోభాలను నివారించడానికి ఈ సదస్సును సదరు దేశాలు ఉపయోగించుకున్నాయి.

G-20 లో చర్చించే ప్రధాన అంశం ఇదే:

Add a heading 2023 11 30T143748.155 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

ఈ సదస్సులో ఏయే అంశాల మీద చర్చిస్తారు అనే సందేశం చాల మందిలో ఉంది. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, శక్తి, ఆరోగ్యం, అవినీతి, అభివృద్ధి వంటి అంశాలపై దీర్ఘంగా చర్చిస్టారు.

ఈ సదస్సు ముఖ్యంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను సమర్ధవంతంగా నడిపించడానికి ఎక్కువ ఏర్పాటు చేయబడింది అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అలాగే ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి కూడా ఈ సదస్సు ఒక చక్కనైన వేదిక. ఇక ఈ G-20 సదస్సులలలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ప్రజా జీవితంపై ప్రభావాన్ని తప్పక చూపెడుతూ ఉంటాయి.

ఇక ఈ G-20 సదస్సు నిర్వహించడానికి ఎటువంటి కార్యాలయం ఇప్పటివరకు లేదు. ఈ సదస్సు ఎక్కడ నిర్వహించాలని నిర్ణయిస్తే ఆదేశమే ఆ సదస్సు యొక్క కార్యాలయం అని చెప్పాల్సి ఉంటుందేమో. పైగా ఏదేశంలో అయితే ఈ G-20 సదస్సులు నిర్వహిస్తారో ఆ దేశమే ఆ సదస్సు నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది.

మరి ఈ G-20 సదస్సు ఏ దేశంలో నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనే దానిపై కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారమే ఈ సదస్సు నిర్వహిస్తారు. G-20 అధ్యక్ష ఎన్నిక అనేది జరుగుతుంది. దాని కోసం ఇందులో ఉన్న 20దేశాలు కూడా 5 గ్రూపులుగా విడిపోతాయి.

అలా గ్రూపులుగా విడిపోయాక, గ్రూపుల వారిగా అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయి. అధ్యక్ష బాధ్యతల కోసం గ్రూపుల మధ్య ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక నిర్వహించిన అనంతరం అధ్యక్షా బాధ్యతను అందరు కలిసి ఎవరో ఒకరికి కట్టబెడతారు. అలా ఈసారి అధ్యక్ష బాధ్యత ఇండియాకి దక్కింది.

ఆర్ధిక అంశాలే కీలకం:

Add a heading 2023 11 30T144335.181 1 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.


ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సామావేశంలో నిర్వహిస్తారని తెలుస్తోంది. అన్ని దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొంటారట. ఆ సదస్సులోనే వారి అభిప్రాయాలను తెలియజేస్తారు.

G-20 అనేది దేశాల కూటమి అని ఎందుకు అంటారు అంటే ఇందులో ఉన్న దేశాల జనాభా చుస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో రెండు వంతుల జనాభా ఈ G-20 దేశాలలోనే ఉంది.

పైగా ప్రపంచవ్యాప్తంగా చుస్తే ఈ దేశాల వాణిజ్యం 75 శతం, ఇక ఉత్పత్తిలో అయితే G-20 దేశాల ఉత్పత్తి 85 శాతంగా ఉంది. ప్రస్తుతం G-20 లో ఉన్న దేశాలను చూస్తే అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియే, యూకే, స్పెయిన్ ఉన్నాయి.

ఇక పోతే ఏ G-20 కూటమిలో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు కొత్తగా చేరెందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో G-20 సమ్మిట్ నుండి ఆయా దేశాలకు ఆహ్వానాలు కూడా పంపించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాలు దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉన్నట్టు తెలుస్తోంది.

భారత్ లో G-20 డిఫ్ఫరెంట్ ఎందుకంటే:

Add a heading 2023 11 30T144549.093 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

గతంలో నిర్వహించిన G-20 సమావేశానికి ఈ ఏడాది భారతదేశంలో నిర్వహిచిన సమావేశానికి కొంత వ్యత్యాసం ఉంది. గత G-20 సమావేశాల్లో ఆయా దేశాధినేతలు పాల్గొని కేవలం ఆర్ధిక పరమైన అంశాలపైనే ఎక్కువగా చర్చించేవారు.

కానీ ఈ సారి మాత్రం G-20 సదస్సులో 20 దేశాధినేతలు ఆర్థిక అంశాలతోపాటు వాతావరణ మార్పులు, సస్టెయినబుల్ ఎనర్జీ, బహుళ జాతి సంస్థలపై సుంకాల విధింపు వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇచ్చారు. వాటన్నిటిలోకి వాతావరణ మార్పుల అంశం అనేది మరింత కీలకమైనది గా తెలుస్తోంది.

ఇక G-20 సదస్సులో ఏ అంశాలను ప్రధానంగా చర్చించాలి అనేదానికి సంబంధించి ఏదేశమైతే ఆతిధ్యం ఇచ్చి అధ్యక్ష బాధ్యతలు చేపడుతుందో ఆదేశమే అజండాను కూడా రూపొందిస్తుంది. 2022 డిసెంబర్​ 1 నుంచి 2023 నవంబర్​ 30 వరకు ఈ బాధ్యతలు ఇండియా వద్దే ఉన్నాయి. ఇక తదుపరి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్ దేశం తీసుకుంటుంది.

ఇక ఈ G-20 సమ్మిట్ లక్ష్యాలను గనుక చూస్తే, పచ్చదనం పెంపు దాని​ని వృద్ధి చేయడం, వాతావరణ మార్పులపై పోరాటానికి ఆర్థిక సాయం అందించడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ను మరింత పెంచడం, వంటివి ఉంటాయి. వాటితో పాటుగా శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం మాత్రమే కాకుండా దానిని మరింత వేగవంతం చేయడం, అందరిని కలుపుకుని వెళ్లేలా చూడటం దీని ముఖ్య ఉద్దేశం.

తరువాతి G-20 బ్రెజిల్ లోనే:

Add a heading 2023 11 30T145105.986 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

ఇక తదుపరి G-20 బ్రెజిల్ లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరోలోని లగూన్ కాంప్లెక్స్‌ వేదిక కానుంది.

ఈ కార్యక్రమాన్ని 2024 నవంబర్ 18,19 తేదీల్లో నిర్వహిస్తారని తెలుస్తోంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా జీ 20 సమావేశానికి అధ్యక్షత వహిస్తాడని తెలుస్తోంది. ఈ సమావేశానికి కూడా ఎప్పటిమాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నాయకులు కూడా పాల్గొంటారు.

బ్రెజిల్ లో నిర్వహించే ఈ G-20 కి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డం, యునైటెడ్ స్టేట్స్ హాజరు కానున్నాయి.

2024 లో G-20 సమావేశంలో చర్చించబోయే ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం తోపాటు, వాతావరణ మార్పుతో పోరాటం అనే అంశంపై చర్చిస్తారు, లాగే సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడం అనే అంశంతోపాటు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ముందుకు తీసుకెళ్లడం అనే అంశంమీద కూడా మాట్లాడతారు.

ఏ దేశానికి ఎలా ఉన్నా ఈ సమావేశం బ్రెజిల్ దేశానికి మాత్రం చాలా ముఖ్యమైన సమావేశం అని చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి, ప్రపంచాన్ని మరింత మెరుగ్గా చేయడానికి ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నారు.

G-20 పై అంత ఆశక్తి ఎందుకంటే:

Add a heading 2023 11 30T145339.710 G-20 Summit 2023: G-20 ఎప్పుడు మొదలైంది, G-20 వల్ల లాభాలు ఏంటి..G-20 లో ఎలాంటి విషయాలు చర్చిస్తారు.

ఈ జీ 20 సమావేశం కోసం అనేక మంది ఎదురుచూస్తూ ఉంటారు, ఎందుకంటే G-20 వంటి సమావేశంలో అనేకదేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా పాల్గొంటుంది, పైగా ఇప్పుడు అభివృద్ధి పధంలో దూసుకెళుతున్న చైనా వంటి దేశం కూడా పాలుపంచుకుంటుంది.

20 దేశాలు ఒక చోటకు చేరి సమిష్టిగా చర్చించి ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి అంటే అది చాలా గొప్ప విషయమని భావిస్తున్నారు. అక్కడ చేపట్టే సమావేశం తో మిగిలిన దేశాల్లో ఒకవేళ సంక్షోభాలు తలెత్తే ప్రమాదం ఉన్నా దానిని నివారించుకోవడానికి ఈ సమావేశంలో సలహాలు సూచనలు పొందే వీలుంటుంది.

కాబట్టి ఎప్పుడైతే మన దేశం సంక్షోభాలకు దూరంగా సంక్షేమానికి దగ్గరగా ఉంటుందో అప్పుడే అభివృద్ధి పధంలో నడిచేందుకు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

Leave a Comment