Gaami Vishwak sen’s Aghora avatar first look : మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwak sen)తనదైన వైవిధ్యమైన నటనతో యూనిక్ కాన్సెప్ట్‌లతో వచ్చే సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
సినిమాలతో ప్రయోగాలు చేయడంలో ఎప్పుడు విశ్వక్ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు మిగతా హీరోలకు భిన్నంగా సినిమాలు తీశాడు.
హిట్టు , ఫ్లాప్ అన్నది చూసుకోకుండా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అంతే కాదు ఈ హీరో అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ తో వర్తల్లో నిలుస్తుంటాడు. ఇక ధమ్కీ (Dhamki) మూవీ తరువాత విశ్వక్ నుంచి మరో సినిమా రాలేదు.
చాలా రోజుల గ్యాప్ తర్వాత విశ్వక్ అందరిని భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. లేటెస్ట్గా విశ్వక్ నటిస్తున్న’ గామి’ (Gaami)మూవీ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్‌లో విశ్వక్ ఒక్కసారిగా భయపెట్టేసాడు. ఈ పోస్టర్‌తో ఈసారి కూడా విశ్వక్ యూనిక్ కాన్సెప్ట్‌తో అలరించేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
‘Gaami’ a Thriller movie : ‘గామి’ ఓ థ్రిల్లర్ సినిమా
విద్యాధర్ (Vidhyadhar) డైరెక్షన్ లో విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా నటిస్తోన్న మూవీ ‘గామి’(Gaami).ఈ సినిమాతోనే డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు విద్యాధర్.
గామి ఓ థ్రిల్లర్ మూవీ. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ మూవీ బజ్ క్రియేట చేసింది. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతుంది. అయినా ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల కాలేదు.
ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. హైదరాబాద్ (Hyderabad)లో జరుగుతున్న కామిక్ కాన్ ఫెస్టివల్ లో గామి ఫస్ట్ లుక్ పోస్టర్ (Gaami First look poster)ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఒక్క పోస్టర్ ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. లోతైన కోరిక మానవ స్పర్శే. ఒక వ్యక్తి విభిన్నమైన కథ.. భయాన్ని జయించడానికి అతని ప్రయాణం” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ని బట్టి కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ముందుగానే ఊహిస్తున్నారు.
ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో విశ్వక్ తొలిసారిగా అఘోరాగా కనిపించనున్నాడు. రీసెంట్ గా గామి సినిమాను ఉద్దేశించి విశ్వక్ మాట్లాడాడు..” దాదాపు నాలుగేళ్లుగా ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నాం. నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హిమాలయాలు, వారణాసి వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేశాము.
కొత్తవాడైనా స్టోరీ విషయంలో డైరెక్టర్ కి ఎంతో క్లారిటీ ఉంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
Vishwaksen who took risk after Balakrishna: బాలకృష్ణ తర్వాత రిస్క్ చేసింది విశ్వకే
స్క్రీన్ మీద అఘోరా క్యారెక్టర్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న విషయం. కమర్షియల్ గా మాస్ నుంచి ఈ క్యారెక్టర్ కు పెద్దగా మద్దతు ఉండదంటారు నిపుణులు.
గతంలో ఇలాంటి పాత్రలను చేసి చాలా మంది హీరోలు చేతులు కాల్చుకున్నారు. 30 సంవత్సరాల క్రితం హీరో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)కాష్మోరా (Kashmora) సినిమాలో అఘోరాగా అద్భుతంగా నటించినా ప్రజల ఆదరణ తక్కువే అని చెప్పకతప్పదు.
శ్రీమంజునాథ (Srimanjunatha) సినిమాలోనూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కాసేపు గెటప్ వేస్తే నటనకు మురిసిన ప్రేక్షకులు కలెక్షన్లు మాత్రం ఇవ్వలేదు. ఇక నేనే దేవుణ్ణి (Nene Devinni) సినిమాలో తమిళ స్టార్ ఆర్య (Aarya) తన నటనతో బెస్ట్ అనిపించుకున్నా బాక్సాఫీస్ లో మాత్రం ఫ్లాప్ చూశాడు.
అయితే ఈ ట్రెండ్ ని టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ (Balakrishna)బ్రేక్ చేశాడు. అఖండ (Akhanda)లో అఘోరా పాత్రలో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించి అదరగొట్టాడు. ఒకరకంగా ఇది ఓ రిస్క్ అనే చెప్పాలి. ఇప్పుడు అదే రిస్క్ ని యంగ్ హీరో విశ్వక్ (Visjwak sen)గామి చిత్రంలో చేస్తున్నాడు.
గామిలో విశ్వక్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఫస్ట్‌లుక్ పోస్టర్ తోనే ఆ విషయాన్ని చెప్పారు మేకర్స్. ఈ సినిమా కథ మొత్తం అఘోరాల చూట్టు తిరుతుందని డైరెక్టర్ విద్యాధర్ తెలిపాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కలర్ ఫొటో ఫేం చాందిని చౌదరి నటిస్తోంది.