Nicolas Puech Property: తోటమాలి 91 వేల కోట్ల ఆస్తి..పనివారికి అంత ఆస్తి ఎందుకిస్తున్నాడంటే.
ఇనుము విరిగితే మరలా అతుకు పెట్టవచ్చు, కానీ మనసు కనుక ఒకసారి ముక్కలైతే జీవితంలో అతుకుపడదు. అందుకే హృదయం అద్దమనీ పగిలితే అతుకదనీ అంటూ ప్రేమాభిషేకం సినిమాలో రాసుకున్నారు దర్శక రత్న దాసరి.
అసలు ఇంతకీ ఎవరి మనసు విరిగింది, ఎందుకు ముక్కలైంది, దాని ఫలితం ఏమిటి అనే కదా మీ సందేహం. అక్కడికే వచ్చేస్తున్నా, స్విట్జర్లాండ్‌లో ఓ పెద్ద మనిషి ఉన్నాడు, అతను కొన్ని కారణాల వల్ల పెళ్లి హెసెసుకోలేదు, పిల్లలు కూడా లేరు.
కానీ బోలెడంత ఆస్తి, ఇప్పుడు ఆ ఆస్తినంతా తన తోటమాలి రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. ఆ ఆస్తి విలువ మన భారత కరెన్సీ లో ఎంతో తెలిస్తే ఆ తోట మాలి నేనే అయితే అబాగుండు అని అనుకోని వారుండరేమో. ఆ ఆస్తి విలువ అక్షరాలా 96 వేల కోట్లు.
తన బంధువులు, అయినా వారు తనతో ఏకీభవించకపోవడం వల్ల అయన మనసు విరిగిపోయింది, తన మాటను తూచా తప్పక పాటించి, తనను అపురూపంగా చూసుకునే తోటమాలే నయం అనిపించాడు
ఆయనకు అందుకే అయన అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. కేవలం ఆస్తి మాత్రమే రాసి ఇచ్చేస్తే దీర్ఘకాలంలో ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందేమో అని భావించిన అయన ఆ తోటమాలిని దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట.
అంత బాగానే ఉంది ముందు ఆ పెద్ద మనిషి పేరు ఏమిటనేగా మీ డౌట్. ఆయన పేరు నికోలస్ ప్యూచ్, అతని వయసు 80 ఏళ్ళు. స్విట్జర్లాండ్‌లో వీరిది ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ.
ఆ కంపెనీ పేరు హెర్మెస్, ఆకంపెనీ పూర్తి షేర్ల విలువ 220 బిలియన్ డాలర్లు, అందులో ఆయనకీ ఉన్న 5-6 శాతం వాటా విలువ 11 బిలియన్ డాలర్లు. ఇంతకీ ఇతని తోట మాలి వయసు ఎంతనుకున్నారు..
అతనికి 51 ఏళ్ళ వయసు, ఒక భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. యజమాని అంటే భక్తి, గౌరవం ఉన్నాయి. అయితే స్విట్జర్లాండ్‌లో వార్త పత్రికల్లో ఎక్కడ కూడా ఆ తోటమాలి పేరు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.
హెర్మెస్ కంపెనీని 1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ అనే వ్యక్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుడు. ఆ హెర్మస్ కంపెనీ వారి కుటుంబంలోని ఐదవతరం వారసుడి ఈ నికోలస్ ప్యూచ్.
వీరి కుటుంబంలో కొన్ని వివాదాలు తలెత్తాయి, అందుకే నికోలస్ తన వాటాను తన ఇష్టానుసారంగా తన ఇష్టమైన వారికి రాసి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. 2014 సంవత్సరంలోనే నికోలస్ ప్యూచ్ వారి కంపెనీ లోని సూపర్‌వైజరీ బోర్డు నుంచి తప్పుకున్నాడు.
ఎల్‌వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ అందులకి ఎంటర్ అయింది, హెర్మన్ కంపెనీలో 23 శాతం వాటాను దక్కించుకుంది.
ఈ క్రమం లో ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నప్పటికీ నికోలస్ మాత్రం తన వాటాను యధావిధిగా కొనసాగించాడు. ఈ కారణాల వల్లనే నికోలస్ తన వారసుడిగా తోటమాలిని ప్రకటించాడు.
నోటు మాటకే దిక్కులేని ఈ రోజుల్లో నోటి మాటకు విలువ ఉంటుందా అందుకే నికోలస్ తన తోటమాలిని దత్తత తీసుకోవాలని భావించాడు.
ఇందులో సాధ్యాసాధ్యాలు ఎంతో తెలుసుకోవడానికి లాయర్ల బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే స్విట్జర్లాండ్ లో పెద్దవారిని దత్తత తీసుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలే ఇప్పుడు ప్రతిబంధకాలు అవుతాయేమో అని యోచిస్తున్నారట.
అయితే కొన్ని మీడియా కధనాల ప్రకారం ఇప్పటికే నికోలస్ తన తోట మాలికి దాదాపుగా సగం ఆస్తిని రాసి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. మరి తోట మాలి లక్ ఎంత వరకు పనిచేస్తుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.