గృహ అవసరాలకు వాడే గాస్ సిలెండర్ ధరలో ఊరట

lpg 1701406937 గృహ అవసరాలకు వాడే గాస్ సిలెండర్ ధరలో ఊరట

ప్రధాని నరేంద్ర మోదీ మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వలన సిలిండర్‌ ధర రూ.974 లు ఉండగా 100 రూపాయల తగ్గింపుతో రూ.874 లు చేరుకుంది. అంతేకాకుండా పీఎం ఉజ్వల పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికే రూ.200 తగ్గింపుతో సిలిండర్‌ ఇస్తున్నారు. ఇప్పుడు కేంద్రం తాజా నిర్ణయం వల్ల లబ్ధిదారులకు రూ.300 లు తగ్గింపుతో సిలెండర్ వస్తుందని అధికారులు చెబుతున్నారు.

అలాగే ప్రభుత్వ వసతి గృహాలు పాటు, ఇతర వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్లకు ఎటువంటి రాయితీలు వర్తించవని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులను చూసినట్లయితే పలు పధకాల క్రింద వచ్చే ఉజ్వల పధకం, దీపం పధకం, జనరల్‌ కనెక్షన్‌ కలిగిన వారు మొత్తం 4.18 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు లెక్కలు ఉన్నాయని అధికారులు చెప్పారు.

వీరందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపు ధర వర్తిస్తుందని అధికారులు చెప్పారు. అందులో పీఎం ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు సంబందించి 83 వేలు ఉండగా అలాగే దీపం, జనరల్‌ కనెక్షన్లు సంబందించి 3.35 లక్షలు వరకు ఉన్నాయని చెప్పారు. వీరందరికీ కేంద్రం అందిస్తున్న రాయితీ అమలు అయితే కాస్త ఊరట కల్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న గ్యాస్‌ పధకాలకు సంబందించి రాయితీ అమలు కోరే లబ్ధిదారులు ఈకేవైసీ (EKYC ) సత్వరమే చేసుకోవాలని అధికారులు చెప్పారు.‘గ్యాస్‌ సిలిండర్‌పై కేంద్రం రూ.100 తగ్గిస్తూ చేసిన ప్రకటనకు సంబందించిన ఉత్తర్వులు త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పారు.

Leave a Comment