
PRS Oberoi : ప్రముఖ వ్యాపార దిగ్గజం పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్(94) కన్ను మూత..
ప్రముఖ వ్యాపార వేత్త, ట్రైడెంట్ హోటల్స్ నిర్వహిస్తోన్న ఒబెరాయ్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ పృథ్వి రాజ్ సింగ్ ఒబెరాయ్ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్నీ ఒబెరాయ్ గ్రూప్ స్వయంగా ప్రకటించింది.
94 ఏళ్ల వయసు ఉన్న ఆయన గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అనేది ఒబెరాయ్ గ్రూప్‌తో పాటు భారత్ తోపాటు విదేశీ ఆతిథ్య రంగానికి కూడా తీరని లోటుగా అభివర్ణించారు సదరు గ్రూప్ అధికార ప్రతినిధి.
నేటి సాయంత్రం ఢిల్లీలోని పకషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయమై వారు మాట్లాడుతూ..ఒబెరాయ్ మన భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక హోటళ్లను విస్తరింపజేశారని అన్నారు. దేశ విదేశాల్లో అయన ఏర్పాటు చేసిన హోటళ్లు ఆతిథ్య రంగాన్ని మరింత ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు.
ఆయన నేతృత్వంలో హోటల్స్ నిర్వర్తించడం మొదలు పెట్టాక దేశీయ హోటళ్ల ముఖ చిత్రం మారిపోయిందని అన్నారు. 1934లో మొదలైన ఒబెరాయ్ గ్రూప్ ఇప్పుడు 7 దేశాలలో 32 లగ్జరీ హోటళ్లు నిర్వహిస్తోందని, అవి మాత్రమే కాక, వీరికి 7 క్రూయిజ్ షిప్పులు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
హోటల్స్ రంగంలో పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్ అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను 2008 జనవరిలో పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
ఇది మాత్రమే కాక అయన మరి కొన్ని అరుదైన ఘనతలు కూడా సాధించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యాధునిక, అత్యంత సౌకర్యవంతమైన హోటళ్లలో ఒబెరాయ్ హోటల్స్ ను ఒకటిగా అయన
మలచినందుకు గాను ఆయన లీడర్ షిప్ క్వాలిటీ కి గాను, ది ఇంటర్నేషనల్ లగ్జరీ ట్రావెల్ మార్కెట్, 2012 సంవత్సరంలో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ను ఆయనకు ప్రదానం చేసింది.