Geethanjali Movie First Look: ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇదిరవకే రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాలకు మళ్లీ సీక్వెల్స్‌ను రూపొందిస్తూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు ఫిల్మ్ మేకర్స్.
అందులోనూ హారర్ కన్సెప్ట్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే 2014లో విడుదలైన అంజలి (Anjali) హీరోయిన్ గా నటించిన హారర్ చిత్రం ‘గీతాంజలి'(Geethanjali)కి కూడా సీక్వెల్ రెడీ అయ్యింది.
‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఆ అనౌన్స్‌మెంట్ తర్వాత ఇప్పటి వరకు సీక్వెల్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు.
ఇక 2024 కొత్త సంవత్సరం సందర్భంగా మేకర్స్ ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ (Geethanjali Malli Vachindi) సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మూవీలోనూ అంజలి గీతాంజలిగా కనిపించబోతోంది. లేటెస్టుగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘చంద్రముఖి’ (Chandramukhi) పోజ్‌లో అంజలి కనిపించింది ఆ మూవీని మరోసారి గుర్తు చేసింది.
ఓ పాడుబడ్డ బంగ్లాలో పసుప రంగు దుస్తులు ధరించి చిరునవ్వుతో అంజలి కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచింది.
Anjali’s ‘Geethanjali’ was big hit : అంజలి నటించిన ‘గీతాంజలి’ పెద్ద హిట్
అంజలి (Anjali) నటించిన ‘గీతాంజలి’ 2014లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమాతో పాటుగా చాలా చిత్రాలు విడుదలయ్యాయి. అయితే తక్కువ బడ్జెట్ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌గా నిలిచింది.
హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన గీతాంజలి (Geethanjali)లో అంజలి పెర్ఫార్మెన్స్ ఆమె గ్లామర్ హైలైట్‌గా నిలిచాయి. కామెడీ యాక్టర్ శ్రీనివాసరెడ్డి (Srinivas reddy), షకలక శంకర్ (Shakalaka Shankar), సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam),
సత్యం రాజేష్ (Sathyam Rajesh), సప్తగిరి(Sapthagiri)లు చేసిన కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ (Raj Kiran)ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతే కాదు అంజలికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. అయితే, పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అంజలి గీతాంజలిగా భయపెట్టేందుకు రెడీ అయ్యింది. ‘గీతాంజలి’
మంచి విజయం సాధించడంతో మేకర్స్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్‌ను అప్పుడే ప్రకటించారు.దీంతో అప్పటి నుంచి సీక్వెల్‌పై ఏదైనా అప్‌డేట్ వస్తుందేమోనని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు ఎట్టకేలకు, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావడంతో అదే విషయాన్ని ప్రకటిస్తూ, మేకర్స్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం అంజలికి 50వ చిత్రం.
Anjali 50th film:అంజలి 50వ చిత్రం
నటి అంజలి తన సినీ కెరీర్‌లో నటిస్తున్న 50వ చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది'(Geethanjali Malli Vachindi).ఇప్పటికే సగానికిపైగా ఈ సినిమా షూటింగ్ పూర్తైందని సమాచారం.
ఈ క్రమంలో కొత్త సంవత్సరం గిఫ్టుగా మేకర్స్ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పాడుబడిన బంగ్లాలో అంజలి (Anjali)క్లాసికల్ డ్యాన్సర్ కలర్ ఫుల్ గా కనిపించింది.
ఈ పోస్టర్‌లో అంజలి ఇచ్చిన పోజ్‌ను చూస్తుంటే అచ్చం చంద్రముఖిలా కనిపించిందని నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని కోన వెంకట్ (Kona Venkat)నిర్మిస్తుండగా సహా నిర్మాతలుగా ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana), జీవీలు ఉన్నారు.
అయితే పదేళ్ల క్రితం తీసిన గీతాంజలిని తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. కానీ ఈ సీక్వెల్ విషయంలో భారీగా బడ్జెట్ పెడుతున్నారని సమాచారం.
ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా తీయబోతున్నారట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ వర్కౌట్ చేస్తున్నారు.
Hero Malayalam actor: హీరోగా మలయాళ నటుడు
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా మలయాళ నటుడిని ఎంపిక చేశారు. మలయాళ స్టార్ రాహుల్ మాధవ్ (Rahul Madhav)తొలిసారిగా టాలీవుడ్ (Tollywood) కు పరిచయం కాబోతున్నాడు.
నిన్ను కోరి(Ninnukori), నిశ్శబ్దం (Nishabdam)వంటి సినిమాలను కొరియోగ్రాఫ్ చేసిన శివ తుర్లపాటి(Shiva thurlapati ) ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు(Praveen lakkaraju) మ్యూజిక్ అందించనున్నారు. ఫస్ట్ పార్ట్ లో కనిపించిన శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ లతో పాటు ఈ సినిమాలో ప్రియ(Priya),
ముక్కు అవినాష్ (Mukku avinash), విరుపాక్ష రవి (Virupaksha ravi) కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ప్రారంభంలోనే మూవీని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పటివరకు వచ్చిన హారర్ కామెడీ మూవీస్ ఒక ఎత్తైతే.. గీతాంజలి మళ్లీ వచ్చింది మరో ఎత్తు అని మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు.