గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక మీదట డాక్టర్ రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్ ఇది. మెగా స్టార్ నట వారసుడిగా తెరంగేట్రం చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ కి అరుదైన గౌరవం లభించింది, ప్రసిద్ధ వెల్ష్ విశ్వవిద్యాలయం చెన్నై అతనికి గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నట్టు అనౌన్స్ చేసింది. యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తూ ఉంటుంది.

ramcharan గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇక మీదట డాక్టర్ రామ్ చరణ్

రామ్ చరణ్ ఈ ఏడాది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ లోనే కాక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కూడా సాధించిన విజయాలకు గాను వేల్స్ విశ్వ విద్యాలయం నుండి ఈ గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ వేడుకను ఏప్రియల్ 13 వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇక చెర్రీ తోపాటు చంద్రయాన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పని చేసిన డా. పి. వీరముత్తువేల్, CMD ట్రివిట్రాన్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు జి.ఎస్. క్వేలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అత్యుత్తమ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అయిన ఆచంట శరత్ కమల్ ఉన్నారు. ఇక తమ ఫేవెరెట్ హీరోకి డాక్టరేట్ దక్కడం పట్ల చరణ్ ఫాన్స్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.

Leave a Comment