ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ముఖ్య మంత్రి వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) రాష్ట్ర రైతాంగానికి ఒక శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి గాను నగదును విడుదల చేశారు.
రైతుల వద్ద వైసీపీ సర్కారు9YSRCP Government) 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దానికి గాను ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయలు చెల్లించింది ప్రభుత్వం. అయితే మిగిలిన 2 వేల కోట్ల రూపాయలను ఇప్పుడు చెల్లిస్తోంది.
రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 20 రోజుల్లోగానే రైతులకు ఈ మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. సంక్రాంతి(sankranthi) సమయంలో ఈ మొత్తాన్ని విడుదల చేయడం వల్ల రైతులకు సంక్రాతి కనుక ఇచ్చినట్టవుతోందని అంటున్నాయి అధికార వర్గాలు. ఇక ఈ రెండు వేళా కోట్ల రూపాయలు 4.09 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి.