నిజం గా ఇది బ్యాంక్ ఉద్యోగులకు పండగ లాంటి వార్తే అని చెప్పాలి. బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న వారం లో 5 రోజులు పనిదినాలు అనే కల నిజం కాబోతోంది. ఆర్ధిక శాఖ ఆమోదం ఇవ్వడమే తరువాయి జూన్ నెల నుండి 5 రోజులు పని చెయ్యాల్సి ఉంటుంది. అయితే ఈ 5 రోజులు పని వల్ల కస్టమర్స్ కు అందించే సెర్వెస్ లో ఎటువంటి సమస్యలు రావని అలగే పని గంటలు ఎం తగ్గిపోవని, ఉద్యోగులకు, అధికారుల పని గంటల్లో ఎటువంటి మార్పు ఉండదని అందులో హామీ ఇచ్చింది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ సంస్ద. ఈ 5 రోజుల పని దినాలు అనేది ఇప్పటికే RBI,LIC లలో అమలు అవుతోందని చెప్పారు. కనుక ఈ విషయాన్ని బాగా లోతుగా పరిశీలించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.