డిప్రెషన్ కు మంచి పరిష్కారం దొరికింది – బ్రెయిన్ పేస్ మేకర్ తో ట్రీట్మెంట్.

website 6tvnews template 89 డిప్రెషన్ కు మంచి పరిష్కారం దొరికింది - బ్రెయిన్ పేస్ మేకర్ తో ట్రీట్మెంట్.

Good news for depression patient : ఈరోజుల్లో చాలా మంది డిప్రెషన్ తో భాధ పడుతుండటం చూస్తూ ఉంటాం. చెప్పాలంటే సరైన ట్రీట్మెంట్ లేక మానసిక రుగ్మతలతో అలాగే ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ డిప్రెషన్ సమస్యకు చెక్ పెట్టె విధం గా సరికొత్త ట్రీట్మెంట్ వల్ల ఆసలు చిగురిస్తున్నాయి. త్వరలో ఈ ట్రీట్మెంట్ అందరికి అందుబాటులో రాబోతోంది.

మెంటల్ హెల్త్ కు వాడే బ్రెయిన్ పేస్ మేకర్ ఈ డిప్రెషన్ ట్రీట్మెంట్ కు మరింత అనువుగా ఉండబోతోంది. ఈ డీప్ బ్రెయిన్ స్టిములేషన్ వల్ల తీవ్ర మైన లేదా రెసిస్టన్స్ డిప్రెషన్ తో భాదపడుతున్న వారికి ఇది వరం లా కనిపిస్తోంది. న్యూయార్క్ లో ఉన్న ఒక పేషంట్ ఎమిలి అనే ఆవిడ ఈ DBS వల్ల తనకు కొత్త జీవితం లబించింది అని చెప్పింది.

ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్ వల్ల తగ్గని ఈ సమస్య DBS – డీప్ బ్రెయిన్ స్టిములేషన్ వల్ల తనకు ఎంత గానో ఉపయోగ పడిందని, దీనివల్ల ఇప్పుడు తను హాయి గా ఉన్నట్లు చెప్పింది. తన వారి లాంటి ఎంతో మంది కి దీనిని వల్ల మంచి ఉపశమనం దొరుకుతుంది అని ఆమె చెప్పింది.

బ్రెయిన్ పేస్ మేకర్ ఎలా ఉపయోగపడుతుంది :

2023 07 inbrief sleep tile tcm7 317827 డిప్రెషన్ కు మంచి పరిష్కారం దొరికింది - బ్రెయిన్ పేస్ మేకర్ తో ట్రీట్మెంట్.

DBS అనేది పార్కిన్సన్ రోగ సమస్యకు, మూర్చ వంటి అనారోగ్య సమస్యకు ఈ బ్రెయిన్ పేస్ మేకర్ వాడడం అనేది ఆమోదించబదిన ప్రక్రియ. ఇప్పడు డిప్రెషన్ ట్రీట్మెంట్ వాడకం లో దీని పని తనాన్ని తెలుసుకోవడానికి రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ట్రీట్మెంట్ లో బాగంగా బ్రెయిన్ లో ఎలక్ట్రోడ్ లను అమరుస్తారు. పేస్ మేకర్ కి ఇది సమానంగా పనిచేస్తుందని చెప్తున్నారు.

ఇంతకుముందు ఎన్నో సవాళ్ళు ఉన్న, ఇటీవల జరిగిన పరిశోధనలలో చాల మంచి ఫలితాలు అందించడమే కాకుండా అందరి దృష్టి ఆకర్షించింది.ఎమిలి తన అనుభవాలను గురించి చెప్తూ తన చిన్న తనం లోనే తన తల్లితండ్రులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం వల్ల తీవ్ర మానసిక వేదనను అనుభవించానని ఆ సమయం లోనే డిప్రెషన్ లో కి వెళ్ళిపోయానని ఆమె చెప్పింది. తనకు కొంత మంది DBS వల్ల చాల ఉపశమనం ఉంటుందని డిప్రెషన్ కూడా తగ్గుతుందని చెప్పడం తో అప్పుడు DBS చేయించు కోవాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పింది. దీని వల్ల మంచి సత్ఫలితాలు కూడా వచ్చాయని చెప్పింది.

ఈ ట్రీట్మెంట్ లో విప్లవాత్మక మార్పులు:

ఎమిలి పై ఈ ట్రీట్మెంట్ ఇన్స్టంట్ గ పాజిటివ్ ఎఫెక్ట్ చూపించింది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక డిప్రెషన్ లక్షణాలు ఊహించని విధం గా దూరమయ్యాయి. ట్రీట్మెంట్ లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఈ DBS పవర్ చాల ఎక్కువ ఉంటుందని చెప్పింది.

అయితే ఈ DBS ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఒక్కసారి సర్జరీ చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. ప్రఖ్యాత లాబ్స్ అయిన అబాట్ లాబొరేటరీస్ వారు కొన్న ముఖ్యమైన అధ్యయనం తో సహా పరిశోధనలు తో పాటు క్లీనికల్ ట్రయల్స్, సాంప్రదాయ ట్రీట్మెంట్ లు తక్కువ ఉన్నవారికి త్వరలో కొత్త ఆశలఅందించాగాలమనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

Leave a Comment