Salaar Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. సలార్ రెండో పాట విడుదల.
టాలీవుడ్ స్టార్ హీరో Pan Indian Star Prabhas నటించిన భారీ యాక్షన్ మూవీ సలార్. కెజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాలతో డిసెంబర్ 22న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది.
ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్యనే Salaar నుంచి విడుదలైన రెండో ట్రైలర్ తో పాటు సూరీడే పాట ఓ రేంజ్‌లో Prabhas ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
ఊచకోతకు రెడీ అవ్వాల్సిందేనని ప్రశాంత్ ఈ ట్రైలర్‌తో పిలుపునిచ్చాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన Salaar కోసం కోట్లాది కళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇదిలా ఉండగా సలార్ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.Prabhas ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికీ ఈ మూవీ నుంచి సూరీడే పాట రిలీజ్ అయ్యింది.
ఇక తాజాగా Salaar నుండి రెండో పాటను మేకర్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ రోజే ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. సాయంత్రం లోపు ఈ పాటను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే మొదటి పాట Salaar , ప్రథ్వీరాజ్ ల మధ్య నడిచే కథను చెబితే, ఇక రెండో పాటు ఐటెం సాంగ్ అని సమాచారం. ఇప్పటికే అన్ని ప్రోగ్రామ్స్ పూర్తి చేసుకుని మేకర్స్ డిసెంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
Salaar మేనియా ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స చేసినప్పటి నుంచి సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా సినిమా టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించారు మేకర్స్.
దీంతో Prabhas ఫ్యాన్స్, సినీ ప్రియులు టికెట్ల కోసం బుక్ మై షో సైట్‌లపై వాలిపోయారు. అభిమానుల తాకిడి పెరిగిపోవడంతో ఒక్కసారిగా వెబ్ సైట్ డౌన్ అయ్యింది.
దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. Prabhasఫ్యాన్స్ అంటే ఇట్లే ఉంటది అని మరోవైపు అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమా టికెట్ల ధరలను పరిశీలిస్తే..
భారీ బడ్జెట్ చిత్రాలకు ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుతోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా Salaar టికెట్ల ధరలను పెంచారు. తెలంగాణ సర్కార్ స్క్రీన్‌లకు 65 రూపాయలు,
మల్టీప్లెక్స్‌లకు 100 రూపాయల చెప్పున ధరలను పెంచింది. ఈ పెరిగిన ధరలు డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 28 వరకు కొనసాగుతాయి.
Prabhas ప్రస్తుతం వరుసగా ప్యాన్ ఇండియా మూవీలతో దుమ్ముదులుపుతున్నాడు. Salaar తర్వాత Prabhas, మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు.
రాజా డీలక్స్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ హార్రర్ కామెడీ నేపథ్యంతో కొనసాగుతుందట. ఇప్పటికే మూవీకి సంబంధించి 60 శాతం షూట్ కంప్లీట్ అయ్యిందని సమాచారం.
ఈ సినిమాను ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే షూట్ చేశారట. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా మాళవిక మోహనన్, రిద్ధి కూమార్ ఫిక్స్ అయ్యారు.
దీనితో పాటే నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ చేస్తున్నాడు. ఈ మూవీలో Prabhas సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించనుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.