Good news for Salaar fans : దీపావళి రోజున డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.సాలార్ సినిమా పోస్టర్ తో ట్రైలర్ డేట్ అనౌన్స్.
దీపావళి రోజున ప్రభాస్ తన ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చే అప్ డేట్ ఇచ్చాడు. సాలార్ సినిమా నుండి ఒక పోస్టర్ ను రిలీస్ చేశాడు. ఈ పోస్టర్ లో ప్రభాస్ చేతిలో గన్ పట్టుకుని ఫుల్ మాస్ లుక్ లో అద్దిరిపోతూ కనిపించాడు. కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో చాలానే ఆశలు ఉన్నాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన స్రుతి హాసన్ నాయికగా నటిస్తోంది. అయితే సినిమా యూనిట్ కేవలం ఒక్క పోస్టర్ మాత్రమే వదిలి ఊరుకోలేదు. ఈ సినిమా నుండి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అన్న విషయంలో ఒక డేట్ కూడా ఫిక్స్ చేసేశారు. డిసెంబర్ 1 వ తేదీన అందుకు మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు.
రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టుగా వెల్లడించారు. హోంబలె ఫిలిమ్స్ పతాకంపై, విజయ్ కిరగండూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి పార్టుకు సాలార్ సీజ్ ఫైర్ అని పేరు పెట్టారు.
అయితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఫైనల్ గా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చేస్తోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ మరో మారు ఈ సినిమా వాయిదా పడుతోంది అంటూ న్యూస్ వైరల్ అయ్యాయి. మరి ఈ విషయం చిత్ర బృందం వరకు వెళ్లిందో ఏమో కానీ రిలీజ్ డేట్ పై మరో సారి క్లారిటీ ఇచ్చారు. తాజా గా రిలీస్ చేసిన పోస్టర్ తోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమా డిసెంబర్ 22 నే ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.
ఇక ఈ సినిమాతో పాటే షారుక్ నటిస్తున్న డుంకి కూడా వస్తోంది. ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా స్టార్, మరి ప్రభాస్ బాలీవుడ్ బాద్షాతో తలపెడితే ఎలా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ గతంలో కెజిఎఫ్ తోపాటు షారుక్ నటించిన జీరో సినిమా రిలీజ్ అయింది.
అప్పుడు కెజిఎఫ్ కలెక్షన్ల వర్షం కురిపించగా, షారుక్ సినిమాకి వసూళ్లు వెలవెలబోయాయి. కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటె ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక గతంలో వచ్చిన రాధేశ్యామ్, ఆది పురుష్ అంచనాలను అందుకోలేకపోవడంతో ప్రభాస్ ఫాన్స్ సాలార్ మీదే ఆశలు పెట్టుకున్నారు.