తెలంగాణా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ రెండు కీలక నిర్ణయాల వలన రేషన్ కార్డు లేని చాలామందికి లబ్ధి చేకూరుతుందని అని చెప్పాలి. అయితే ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల కు సంబందించి రెండు కీలక నిర్ణయాలను తీసుకుంది. దీని వల్ల ఉచిత కరెంటు వాడుతున్న లబ్ధిదారులకు కూడా లాభం చేకూరుతుంది.
అసలు రేషన్ కార్డు లేని వారికి కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి దిశగా అడుగులు వెయ్యడం మొదలు పెట్టింది. ఇప్పటికే పలు రకాల గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా జీరో కరెంట్ బిల్లుకు సంబందించి కొన్ని ఆదేశాలు జారి చేసింది. ఇప్పటికే చాలామంది జీరో కరెంట్ బిల్లులను పొందిన వారు ఉన్నారని అధికారులు చెప్పారు.
నూతన ఆదేశాలు ప్రకారం ఇక అలాంటివారు కరెంట్ బిల్లులు కట్టనవసరం లేదు. గృహ విద్యుత్ కి వాడే 200 యూనిట్ల వరకు ఎంత బిల్లు వచ్చినా ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు.తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న నిర్వహించనున్న క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేషన్ కార్డుల పై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు తెలుస్తోంది. అయితే రేషన్ కార్డు లేనివారికి ఇది ఒక సానుకూల అంశం అనే చెప్పాలి.
కాని కొంతమందికి ఇప్పటికీ కరెంటు బిల్లు రావడం జరుగుతోంది. అయితే లబ్దిదారుడి వివరాలు సరిగా ఇవ్వకపోవడం వలన కొంతమందికి విద్యుత్ బిల్లులు ఇప్పటికి వస్తున్నాయని గృహ యజమానులు చెప్తున్నారు.లబ్దిదారులకు 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ అయితే, మరల కరెంట్ బిల్లు వచ్చినట్లయితే అలాంటి వారు బిల్లు కట్టకుండా వారి వివరాలతో అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, విద్యుత్ కనెక్షన్ నెంబర్ అన్ని వివరాలు తీసుకుని ఒకసారి మండల పరిషత్ లేదా మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి మరోసారి దరఖాస్తు చేసుకోవాలి, అప్పుడు మీకు జీరో బిల్లు వస్తుంది.