దేశంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరల్లో మందుల అందించాలని ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం జన్ ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జన ఔషధీ కేంద్రాలను ప్రారంభించాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. అదేంటంటే జన ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించాలనే వారికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి హామీలు లేకుండా రుణాలు అందిస్తోంది. ఇప్పుడు ఈ జన ఔషధీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే చిన్న ఆపరేటర్లకు ఎటువంటి హామీ లేకుండా SIDBI నుండి రుణాలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ రుణాలనేవి గ్యారెంటీ, వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్లు , మైక్రో అండ్ స్మాల్ అండ్ ప్రైసెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ద్వారా వీరికి అందించబడతాయి. ఈ జన ఔషధీ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా జనరిక్ మందులు సామాన్య ప్రజలకు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు క్యాన్సర్ ట్యాబ్లెట్ బయట మార్కెట్లో 2,250 రూపాయలు ఉంటే అది జనం ఔషధీ కేంద్రం వద్ద 250 రూపాయలకే దొరుకుతుంది.
అంతే కాకుండా గ్రామీణ ప్రాంత బాలికలు ఈ కేంద్రం ద్వారా సానిటరీ నాప్కిన్స్ ని ఒక రూపాయికి కొనుక్కోవచ్చు. 2026 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 25 వేలు జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 10,624 జన్ ఔషధీ కేంద్రాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈ జన్ ఔషధీ కేంద్రాల ద్వారా సామాన్య ప్రజలకు దాదాపు 1965 అన్ని రకాల మందులను, అదేవిధంగా ఆపరేషన్కు వాడే 293 మందులను తక్కువ ధరల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో విక్రయించడం జరుగుతోంది.
2022 – 2023 ఆర్ధిక సంవత్సరానికి గాను ఈ జన ఔషధి కేంద్ర ద్వారా మొత్తం 1,235.95 కోట్లు విక్రయాలు జరుగగా , దీని ఫలితం గా సామాన్య ప్రజలకు దగ్గర దగ్గర 7,416 కోట్లు ఆదాయం ఆదా అయ్యిందని అధికారులు చెప్పారు ఎవరైనా ఈ జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు చేయాలనీ అనుకుంటారో వారి కోసం కేంద్రం https://jak-prayaasloans.sidbi.in/home ఈ వెబ్‌సైట్‌ను అందరికి అందుబాటు లోకి తీసుకువచ్చింది.