Good news for Tirupati commuters: తిరుపతి ప్రయాణికులకు శుభవార్త.

Good news for Tirupati travelers.

Good news for Tirupati commuters: తిరుపతి ప్రయాణికులకు శుభవార్త.

తిరుపతి, ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara) వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాదిగా తరలి వాస్తు ఉంటారు.

ఈ క్రమంలోనే అనేక రైళ్లను అనేక ప్రాంతాల నుండి తిరుపతికి కనెక్ట్ చేస్తూ ఉంటారు. స్పెషల్ రైళ్లు ఎక్కడినుండైతే మొదలవుతాయో, ఆయా ప్రాంతాల వారే కాక ఆ చుట్టుప్రక్కల అనేక మండలాలు గ్రామాల ప్రజలకు కూడా ఆ రైలు వారి ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ క్రమంలోనే ప్రస్తుతం కరీంనగర్(Karimnagar) నుండి తిరుపతికి వెళుతున్న రైలు కి సంబంధించి ఒక కొత్త అప్ డేట్ వచ్చింది.

ఆ రైలు ఇప్పటివరకు వారానికి రెండు పర్యాయాలు కరీంనగర్ నుండి తిరుపతికి వెళుతుండగా ఇక మీదట వారానికి నాలుగుసార్లు తిరుపతికి వెళ్లేలా షెడ్యూల్ ను మార్చారు.

ఇప్పటివరకు ఈ రైలు గురువారం, ఆదివారం కరీంనగర్ నుండి తిరుపతికి వెళుతోంది. అయితే ఎక్స్టెండ్ చేసిన షెడ్యూల్ ప్రకారం వారంలో ఏ రెండు రోజులు ఇది కరీంనగర్ నుండి తిరుపతికి వెళుతుంది అన్నది ఇంకా తెలియరాలేదు.

రద్దీనే ప్రధాన కారణం : Congestion is the main reason:


కరీంనగర్ నుండి తిరుపతికి ఈ రైలు మరో రెండురోజులు పొడిగింపబడటానికి కారణం కూడా లేకపోలేదు. ఈ రైలులో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి,

పార్లమెంట్ మెంబర్ ధర్మపురి అరవింద్(Dharmapuri Aravind MP) కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav) ను కలిశారు.

ఈ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్లే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, రద్దీ కూడా ఎక్కువ ఉంటోందని అన్నారు. కాబట్టి ప్రయాణికుల రద్దీ ఏ రోజుల్లో

ఎక్కువగా ఉంటుందో ఆ రోజుల్లోనే రైలును షెడ్యూల్ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. అంతే కాకుండా ఈ విషయంలో రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

జమ్మికుంట స్టాపింగ్ పై పరిశీలన : Observation on Jammikunta Stopping:


ఇదే క్రమంలో ఎంపీ అరవింద్ రైల్వే మంత్రి వద్ద ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాల ప్రజల చిరకాల కోరిక అయినా కరీంనగర్ – హాసన్ పర్తి(Hassanparti) విషయాన్నీ ప్రస్తావించారు.

ఈ రైల్వే కొత్త లైన్ కోసం లొకేషన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని, కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని కోరారు.

ఈ విషయం పై సానుకూలంగా స్పందించడమే కాకుండా వెంటనే అధికారులకు కాల్ చేసిన మంత్రి ఫైనల్ లొకేషన్ పనులు సత్వరమే పూర్తి చేయాలనీ ఆదేశించారు.

ఇక తమ ప్రాంతంలో వ్యాపారులకు సామాన్య ప్రజలకు ప్రధాన కేంద్రంగా ఉన్న జమ్మికుంట(Jammikunta) విషయాన్నీ కూడా కేంద్ర మంత్రి వద్ద ప్రస్తావించారు బండి సంజయ్.

తెలంగాణ ప్రాంతంలోని అనేక ప్రాంతాల నుండే కాక, ఇతరుల రాష్ట్రాల నుండి కూడా చాల మంది వ్యాపార పనుల నిమిత్తం జమ్మికుంటకు వస్తుంటారని, అటువంటివారికి జమ్మి కుంటలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల కు స్టాపింగ్ కల్పిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.

ఈ జమ్ముకుంటా రైల్వే స్టేషన్ మీదుగానే చెన్నై – అహ్మదాబాద్ నవజీవన్(Navajeevan Express) రైలు, హైదరాబాద్ – న్యూ ఢిల్లీ తెలంగాణ రైలు(Telangana Express), సికంద్రాబాద్ నుండి గోరఖ్ పూర్ వెళ్లే గోరఖ్ పూర్ రైలు(Gorakhpur Express),

యాశ్వంత్ పూర్ నుండి గోరఖ్ పూర్ వెళ్లే రైలు, సికంద్రాబాద్ – పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్ప్రెస్(Danapur Express) రైళ్లు వెళుతూ ఉంటాయని వాటికి అక్కడ స్టాపింగ్ కల్పిస్తే ఇక్కడి ప్రజానీకానికి చేలా మేలు చేకూరుతుందన్నారు.

అయితే ఈ రైళ్లకు జమ్మికుంటలో స్టాపింగ్ కల్పించడం అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది పరిశీలించి సాధ్యమైన మేర చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Comment