నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : Good News For Unemployed people

website 6tvnews template 2 నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : Good News For Unemployed people

Good News For Unemployed people : తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(RevanthReddy) నిరుద్యోగులకు గొప్ప శుభ వార్త చెప్పారు. కేవలం పదిహేను రోజులలో 5 వేల కానిస్టేబుల్ పోస్టిలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు 7 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాం(Congress Government) లో ఏడాది తిరిగే సరికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ విషయాలను సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి(Indravelli) లో ఏర్పాటు చేసిన బహిరంగ లో ప్రసంగిస్తూ చెప్పారు.

ఇక ఏదైతే కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి సీఎం ప్రస్తావించారో, ఆ పోస్టుల భర్తీ గురించి మంత్రి వర్గం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అన్నారు.

పోలీసు నియామకాల గురించి చుస్తే, 2022 లో అప్పటి బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 16,604 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా వాటి నుండి 15,640 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.

Leave a Comment