గుడ్‌న్యూస్ – సూర్య‌కుమార్ యాద‌వ్‌ రిటర్న్ IPL !

website 6tvnews template 2024 04 04T163905.791 గుడ్‌న్యూస్ - సూర్య‌కుమార్ యాద‌వ్‌ రిటర్న్ IPL !

వ‌రుస పరాజయాలు తో డీలా పడిన ముంబై ఇండియ‌న్స్ పెద్ద ఊరట లభించే న్యూస్ అనే చెప్పాలి. ఇటీవల వరుస గాయాలతో జ‌ట్టుకు దూర‌మైన టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ గాను, హిట్ట‌ర్‌ గాను పేరు సంపాదించిన సూర్య‌కుమార్ యాద‌వ్ తిరిగి IPL లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ‌న‌వ‌రిలో సౌతాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. అంతే కాదు మోకాలి గాయం వల్ల జట్టుకు మూడు నెల‌ల పాటు దూర‌మ‌య్యాడు.

అయితే పూర్తిగా గాయం నుంచి సూర్య‌కుమార్ యాద‌వ్ పూర్తిగా కోలుకున్నాడని నేష‌న‌ల్ క్రికెట్ అకాడెమీ ప్ర‌క‌టించడామే కాకుండా ఇప్పుడు IPL మ్యాచ్ లు జరుగుతున్న సమయం లో అతడు ఆడడానికి అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పుడు అత‌డు క్రికెట్ ఆడ‌టానికి 100% ఫిట్‌గా ఉన్నాడంటూ క్లియ‌రెన్స్ కుడా ఇచ్చింది. గురువారం సూర్య‌కుమార్ యాద‌వ్ ముంబై ఇండియ‌న్స్ టీమ్‌లో చేరబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి.

ఇప్పడు ముంబై ఇండియ‌న్స్ త‌న తర్వాత మ్యాచ్ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌లో ఆడనుంది. ముంబైలోని వాంఖ‌డే గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ ద్వారానే సూర్య‌కుమార్ యాద‌వ్ IPL లోకి అడుగుపెడతాడని సమాచారం . అంతే కాదు ఈ మ్యాచ్‌లో అత‌డిని జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. సూర్య‌కుమార్ టీమ్ లో చేరడం వల్ల ముంబై ఇండియ‌న్స్ మిడిల్ ఆర్డ‌ర్ మ‌రింత స్ట్రాంగ్‌గా తయారయ్యే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు చెప్తున్నారు.

టీ20 ఫార్మెట్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌కు ఉన్న ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే మంచి రికార్డులు ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఫార్మెట్‌లో టీమిండియా త‌ర‌ఫున నాలుగు సెంచ‌రీలు కూడా చెయ్యడం విశేషం. అతడు 60 మ్యాచుల్లో సగటు 45. 5 యావ‌రేజ్‌తో 2,141 ర‌న్స్ చెయ్యడం జరిగింది. IPL లో ఇప్ప‌టివ‌ర‌కు సూర్య‌కుమార్ 139 మ్యాచ్ లు ఆడి 3,249 ర‌న్స్ చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ కుడా ఉంది.

Leave a Comment