C.M. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆటోడ్రైవర్లకు గుడ్ న్యూస్ – ఒక్కొక్కరికి రూ.12 వేలు : Good News to Telangana Auto Drivers.

website 6tvnews template 39 C.M. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆటోడ్రైవర్లకు గుడ్ న్యూస్ - ఒక్కొక్కరికి రూ.12 వేలు : Good News to Telangana Auto Drivers.

Good News to Telangana Auto Drivers – C.M Reventh : నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి విజయం సాధించడం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి పలు సంచలనల నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు.

ఆయన ఎన్నికల ముందు చేసిన 6 హామీల పధకాల అమలు పై కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు అవుతున్నాయి.

అయన ఇచ్చిన హామీల పధకాల అమలు కోసం ప్రజా పాలన అనే కార్యక్రమాన్ని విజయవంతం గా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రజా పాలన కార్యక్రమం లో అటో డ్రైవర్ లు మహాలక్ష్మి పధకం వల్ల తమకి అన్యాయం జరుగుతోందని మొర పెట్టుకోవడమే కాకుండా కొన్ని చోట్ల ఆందోళనలు కూడా చేసారు.

Telangana Auto Driver :

అంతే కాకుండా ఈ మహాలక్ష్మి పధకం వల్ల ఆటో లే కాకుండా క్యాబ్ లు, ప్రేయివేట్ వాహనాలు నడుపుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని C.M. రేవెంత్ రెడ్డి దృష్టి కి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఆటో వాలాల విషయం లో ఒక నిర్ణయానికి రాకపోయినట్లయితే ఆందోళనలు చేపడతామని టీఏటీయూ ఆటో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఒక ప్రకటన విడుదల చేసారు.

ఈ క్రమం లో భాగం గా ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహిస్తామని చెప్పారు. తాజాగా తెలంగాణ మంత్రి అయిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆటో డ్రైవర్లకు కోసం ఒక కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని అసెంబ్లీలో ప్రకటించడమే కాకుండా వచ్చే బడ్జెట్‌లో ఆటో డ్రైవర్లకు రూ.

12 వేలు చొప్పున కేటాయిస్తామని , అలాగే ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో ఇస్తామని ప్రకటించడంపై చర్చలు కొనసాగుతున్నాయి.

Leave a Comment