GPAI 2023: అంతర్జాతీయ సదస్సుకి వేదికగా మారిన భారత్.
మరో ప్రపంచ సదస్సుకి వేదికగా మారిన భారత్. వివిధ దేశాల్ని ఆహ్వానించిన ప్రధాని నరేంద్రమోడీ.
గ్లోబల్ పార్టనర్‌షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2023 ని న్యూఢిల్లీలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రగతి మైదాన్ లోని భరత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. దీని ప్రారంభం భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ చేయనున్నారు.ఈ కార్యక్రమం గురించి ప్రధానమోడీ తన సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో చర్చించబోయే అంశాలు ఇన్నోవేషన్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇంకా అన్ని రంగాలను ప్రభావితం చేసే ఈ టెక్నాలజీ గురించి ఉంటాయి.ఈ సమావేశంలో 24 దేశాలు సభ్యత్వం వహించనున్నాయి.
ఈ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ పార్టనర్ షిప్ సందర్బంగా 150కి పైగా ప్రముఖ వక్తలు మాట్లాడనున్నారు.
30కి పైగా సెషన్ లను నిర్వహిస్తున్నారు.
ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ కి సంబంధించిన స్టార్టప్ లు ఈ సదస్సులో దాదాపు 150 ఇందులో పాల్గొననున్నాయి.
డిసెంబర్ 12వ తారీఖున 2023లో సాయంత్రం 5 గంటలకు ప్రధాని ఈ సమ్మిట్ ని మొదలుపెట్టనున్నారు.
ప్రధానమంత్రి ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ని దాని అభివృద్ధిని గురించి ప్రస్తావిస్తూ, ఆర్టిఫిషల్ ఇంటిలెజెన్స్ అనేక రంగాలలో టెక్నాలజీ ఇన్వెన్షన్స్, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయాభివృద్ధి ఇలా మరిన్ని అంశాల గురించి తెలిపారు.