Greetings from film celebrities to CM Revanth: సీఎం రేవంత్ కు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు..నేడు ఏయే పథకాలు ప్రారంభించారంటే..
తెలంగాణా రాష్ట్ర ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీ హామీలను ఇచ్చిందో వాటిని అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు, అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ లోని ఎమ్మెల్యేలను ఎవరినైతే మంత్రులుగా ఎన్నుకున్నారో వారికి శాఖలు కూడా కేటాయించారు.
తాజాగా డిసెంబర్ 9వ తేదీన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే హామీని అమలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పై కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
ఈ క్రమంలో సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని ఎంపిక చేయడంతో ఆయనకు రాజకీయ రంగం నుండే కాకుండా సినీ రంగం నుండి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇప్పటికే రేవంత్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ హీరో నిఖిల్, వంటి వారు హుదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఒక మాట చెప్పుకోవాలంటే సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి పొలిటికల్ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డికి ఒక పోలిక కూడా ఉంది.సినిమాల్లో చిరు ఎవరి ఆదినాదండలు లేకుండానే హీరోగా ఎదిగితే, పొలిటికల్ ఫీల్డ్ లో రేవంత్ కూడా ఇండిపెండెంట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు.
జెడ్.పి.టి.సి గా, ఎమ్మెల్సీ గా రేవంత్ గెలిచింది ఇండిపెండెంట్ గానే, ఆతరువాతే అయన టీడీపీ గూటికి చేరారు. సినిమాల్లో మెగాస్టార్ కి తోడుగా ఉన్నది ప్రేక్షకులైతే, పొలిటికల్ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డికి తోడుగా ఉన్నది ఓటర్లు.
ఓటర్ల ఆదరణతోనే సీఎం గా పగ్గాలు చేపట్టిన రేవంత్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రాం చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Congratulations to @revanth_anumula garu on assuming office as the new CM of Telangana! May you lead the state to new heights of success, prosperity and development.
— Mahesh Babu (@urstrulyMahesh) December 8, 2023
సీఎం రేవంత్ ని ఉద్దేశించి రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు, అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని మహేష్ ట్వీట్ చేస్తే, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సానుకూల మార్పులు వస్తాయని భావిస్తున్నట్టు గ్లోబల్ స్టార్ ట్వీట్ చేశారు.
ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ చేతుల మీదుగా మహా లక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు పారంభం అయ్యాయి. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించనున్నారు.
రాష్ట్ర సరిహద్దుల వరకు మహిళలు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి దాని పరిధిని పెంచారు. 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిచిని పెంచింది తెలంగాణ సర్కారు.