తెలంగాణాలో మొదలైన గృహజ్యోతి – ఇక నుండి జీరో కరెంట్ బిల్

website 6tvnews template 2024 03 01T174853.861 తెలంగాణాలో మొదలైన గృహజ్యోతి - ఇక నుండి జీరో కరెంట్ బిల్

Grihajyoti started in Telangana – Zero current bill from now on : తెలంగాణా లో ఎన్నికల సమయం లో కాంగ్రెస్ చేసిన వాగ్దానాల లో మరో గ్యారెంట్ ఈరోజు నుండి అమలు లోకి వచ్చింది. గృహజ్యోతి పధకం లో అందిస్తున్న ఉచిత కరెంట్ పధకం క్రింద ఇక జీరో కరెంట్ బిల్లులు జారీ చేస్తున్నారు.

జీరో బిల్లు కోసం అవసరమైన సాఫ్ట్వేర్ కూడా తగిన మార్పులు చేర్పులు కూడా చెయ్యడం జరిగింది. తెలంగాణా రాష్ట్ర మొత్తం అన్ని సెక్షన్ల లో నేటి నుండి 200 లోపు యూనిట్లు వాడినట్లయితే జీరో బిల్లు వస్తుంది అలాగే అలాంటి వారికి జీరో బిల్లు జారీ చేయాలని అధికారులను కుడా ఆదేశించారు.

ఈ పధకానికి అర్హులు అయ్యి జీరో బిల్లు రాకపోతే తమ దగ్గరలో ఉన్న మునిసిపల్ లేదా మండల ఆఫీస్ కి వెళ్ళి మరోమారు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.దీని కోసం అవసరమైన పత్రాలు అంటే తెల్ల రేషన్ కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్ కార్డు, విద్యత్ కనెక్షన్ నెంబర్ ఇవన్ని సంబందిత ఆఫీసర్ కి ఇచ్చినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

Leave a Comment