Gunnies Record With Kuchipudi Dance : కూచిపూడి నృత్యం తో గిన్నిస్ రికార్డ్.

కృతి సనన్ 7 Gunnies Record With Kuchipudi Dance : కూచిపూడి నృత్యం తో గిన్నిస్ రికార్డ్.

Gunnies Record With Kuchipudi Dance : కూచిపూడి నృత్యం తో గిన్నిస్ రికార్డ్

కూచిపూడి నృత్యం తో గిన్నిస్ రికార్డ్ : Gunnies Record With Kuchipudi Dance : 3782 మంది కళాకారులు కూచిపూడి నృత్య కోపకాన్ని ప్రదర్శించారు : 3782 Dancers Performed Kuchipudi Dance :

కూచిపూడి నృత్యం(Kuchipudi Dance) ఇది ఒక అద్భుతమైన నృత్య రూపకం(Dance Form), ముఖ్యంగా ఇది తెలుగు వారి నృత్యం, ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్యానికి(World Famous Dance Form) అభిమానులు ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా దీనిని నేర్చుకుని వారిలో కళా తృష్ట తీర్చుకున్నవారు ఉన్నారు. ఈ నృత్యాన్ని ఆంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించి మన తెలుగువారి ఖ్యాతిని దిగ్ దిగంతాలకు వ్యాపింపజేసిన కూచిపూడి నాట్యకళాకారులు(Kuchipudi Dancers) అనేక మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ కూచిపూడి డాన్స్ తో గిన్నిస్ రికార్డునే(Gunnies Record) సృష్టించారు మన తెలుగు నాట్యకారులు(Telugu Dancers), ఇందుకు హైదరాబాద్(Hyderabad) నగరం వేదిక అయింది.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్​ నగరం లోని గచ్చి బౌలి స్టేడియంలో(Gachibowli Stadium) ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 3782 మంది కళాకారులు 7 నిమిషాల పాటు కూచిపూడి నృత్య(Kuchipudi Dance) ప్రదర్శన చేశారు. ఇంత పెద్ద సంఖ్య లో నాట్య కళాకారులు ఎవ్వరు కూడా ఏ నాట్య రూపకంలో నృత్య ప్రదర్శన ఇచ్చింది లేదు కాబట్టి ఇది గిన్నిస్ రికార్డుల్లో(Gunnies Record) చోటు దక్కించుకుంది.

భారత్ ఆర్ట్ అకాడమీ(Bharat Art Academy) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనుత శబ్దం ఆధారంగా చేసుకుని మూడు వేల కి పైగా కళాకారులు ఏడు నిమిషాల పాటు నృత్య రూపకానికి లయబద్దంగా కాలు కదిపారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు(Telanagan Ministers) సీతక్క(Seetakka), జూపల్లి కృష్ణ రావు(Jupalli Krishnarao) ముఖ్య అతిధులుగా హాజరైన ఈ కళాత్మక ప్రదర్శన గిన్నిస్ బుక్ లో చూస్తూ దక్కించుకుందని గిన్నిస్ బుక్ ప్రతినిధే స్వయంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమం గురించి మంత్రులు మాట్లాడుతూ, ఇదొక అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు, కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కళలను, కళాకారులను(Fine Arts And Artists) తప్పకుండ ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.

అయితే ఈ కూచిపూడి నృత్యం(Kuchipudi Dance) గురించి మాట్లాడుకుంటే ఇది ఒక అద్భుతమైన కళ , ఈ కూచిపూడి నృత్యాన్ని అవపోసన పట్టి ఉన్నత స్థానాలకు వెళ్లివారు అనేకమంది ఉన్నారు. సినిమా తరాలుగా ఎదిగి, అశేష ప్రేక్షకాదరణ పొందినవారు ఉన్నారు. అభినయ ప్రధానంగా సాగే ఈ నృత్యాన్ని అభ్యసించిన వారు ఎటువంటి హావభావాలనైనా నలవోకగా పలికించగలరు అని దర్శకనిర్మాతలు నమ్మేవారు. అందుకే ఆ నాట్యంలో నిష్ణాతులుగా ఉన్న మంజు భార్గవి(Manju Bhargavi), ప్రభ(Prabha) వంటివారిని ఏరికోరి ఎంపిక చేసుకున్నారు. అయితే కూచిపూడి నాట్య గురువులైన వెంపటి చినసత్యం(Vempati China Satyam) వంటి వారు సినిమాలకు కూడా నృత్య దర్శకత్వం వహించారు. ముఖ్యంగా నర్తనశాల(Nartanashala) సినిమా కోసం ఎన్టీఆర్(NTR) వెంపటిని తెచ్చి పెట్టుకున్నారని అప్పట్లో చెప్పుకునే వారు.

Leave a Comment