Guntur Kaaram Censor Report: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కాంబోలో వస్తున్న మూవీ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram).
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై వస్తున్న ఈ మూవీని ఎస్. రాధాకృష్ణ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా టాలీవుడ్ క్రష్ శ్రీలీల(srileela),మరో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ (Meenakshi Choudary)హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
సీనియర్ నటులు రమ్య కృష్ణ (Ramya Krishna),ప్రకాష్ రాజ్ (Prakash Raj)సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన మాస్ మసాలా పాటలు ప్రేక్షకులను , మహేష్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇక రీసెంట్ గా విడుదలైన కుర్చి పాట దుమ్ముదులుపుతోంది.
మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ రూపొందించిన
చూడగానే మజా వస్తుంది
— Naga Vamsi (@vamsi84) January 4, 2024
హార్ట్ బీట్ పెరుగుతుంది
ఈల వేయాలి అనిపిస్తుంది!
blockbuster bomma loading
remember the date and time
jan4th 💥🔥 pic.twitter.com/gEmcAyiSsN
ఈ మూవీ ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. లేటెస్టుగా గుంటూరు కారం సెన్సార్ కూడా పూర్తయినట్లుగా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Guntur Karam got U/A Certificate : గుంటూరు కారం మూవీకి U/A సర్టిఫికేట్
గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ తాజాగా ఈ సెన్సార్ పూర్తైంది. ఈ మూవీకి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ వచ్చింది. సంక్రాంతి పండుగకు పర్ఫెక్ట్ మూవీ అనేలా..
సెన్సార్ బోర్డ్ (Sensor board)నుంచి గుంటూరు కారంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ టాక్ విని ప్రొడ్యూజర్ నాగవంశీ (Naga vamshi) ట్విట్టర్ ద్వారా టాక్ ఎలా ఉంటుందనేది తెలిపారు.
“చూడగానే మస్తు మజా వస్తుంది.. హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరుగుతుంది.. ఈల వేయాలనిపిస్తుంది” అని నాగవంశీ ట్వీట్ చేశారు.
ఇక మహేష్ బాబు (Mahesh Babu)ను పోకిరి (Pokiri) క్యారెక్టర్ లో చూసినట్టు చెబుతున్నారు. సర్కారు వారి పాటలోనూ మాస్ గా కనిపించారు మహేష్ బాబు..
ఇందులో మాస్ మేనరిజంతో ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించారు. ఇదే క్రమంలో గుంటూరు కారం కథ కొత్తగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ సంక్రాంతికి పర్పెక్ట్ సినిమా అని అంటున్నారు. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాల నేపథ్యంలో మూవీకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది.
pre-release event chief guest Pawan Kalyan: ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్
గుంటూరు కారం(Guntur Kaaram)ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ (Hyderabad) లో జనవరి 6న జరుగనుంది. పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న మూవీ కావడంతో చాలా గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్.
అంతే కాదు ఆ రోజే ట్రైలర్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు సమాచారం.
గుంటూరు కారం: Guntur Kaaram Censor Report
గుంటూరు కారం పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix)దక్కించుకుంది. తాజాగా దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్ ఓ అనౌన్స్మెంట్ చేసింది.
ప్యాన్ ఇండియా లెవెల్ లో రూ.200 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తోంది. హీరో ప్రిన్స్ మహేష్ బాబు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
అదే రేంజ్‌లో మార్కెట్ జరుగుతోందట. ఇప్పటికే ఈ చిత్రం థయేట్రికల్ రైట్స్ దాదాపు రూ.120 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్లకు క్లోజ్ అయినట్లు ఇన్ఫర్మేషన్. తాజాగా నిర్మాతలు ఓవర్ సీస్ రైట్స్ కోసం రూ. 23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.