Guntur Kaaram first day collections 50cr: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూసిన గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ USA సహా భారతదేశంలో మంచి ఓపెనింగ్ లో ప్రీ-సేల్స్, అడ్వాన్స్ బుకింగ్‌లతో రికార్డ్ నమోదు చేసింది. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో మహేష్ ఈ మూవీలో ఎంతో పర్ఫెక్ట్ గా తన రోల్ కి న్యాయం చేశాడు.
ఇక టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల (Srileela) మొదటిసారిగా మహేష్ బాబుతో జోడీ కట్టి స్క్రీన్ మీద దుమ్ముదులిపింది. తన డ్యాన్స్ , గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేసింది.
ఇకపోతే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబోలో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అంతగా చేరుకోలేదనే టాక్ వినిపిస్తోంది. పేలవమైన స్టోరీ, కథనం కారణంగా అభిమానులు కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Solid record in Nizam market: నైజాం మార్కెట్లో సాలిడ్ రికార్డ్
ఇక మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో గుంటూరు కారం (Guntur Kaaram)కు సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ముందుగా అనుకున్నట్లుగానే నైజాం మార్కెట్ (Nizam Market)లో మహేష్ మూవీ సాలిడ్ రికార్డు సెట్ చేసింది.
నైజాంలో బాక్సాఫీస్ వద్ద ‘గుంటూరు కారం’ అదరగొట్టేసింది. మొదటి రోజే మహేష్ బాబు (Mahesh Babu)మూవీకి 16.9 కోట్ల షేర్ రాబట్టినట్టుగా సమాచారం. దీనితో ఈ చిత్రం నైజాంలో మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీ రికార్డుని బ్రేక్ చేసింది.
అంతే కాదు రీజనల్ వైజ్‌గా ఆల్ టైం హైయెస్ట్ రికార్డును గుంటూరు కారం నెలకొల్పినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సినిమాపై మిక్స్డ్ టాక్ తోనే ఇంతలా రికార్డ్ సెట్ చేయడం.
Guntur Kaaram first day collections 50cr: మొదటి రోజే రూ.50 కోట్లు వసూలు
మహేష్ (Mahesh Babu) గుంటూరు కారం (Guntur Kaaram) కి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ పెద్ద సంఖ్యలో థియేటర్లలో సినిమా విడుదల కావడంతో ఫస్ట్ డేనే సూపర్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని రూపొందించారు మేకర్స్.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా రూ.42 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ హాలిడేస్ కావడంతో గుంటూరు కారం మరిన్ని కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.
అయితే సంక్రాంతి బరిలో హనుమాన్ (Hanuman) విపరీతమైన పాజిటివ్ బ్లాక్ బస్టర్ టాక్‌తో థియేటర్లలో దుమ్ముదులుపుతోంది. దీంతో ఈ మూవీ ప్రభావం మహేష్ సినిమాపై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరుసగా ఇవాళ వెంకటేశ్ (Venkatesh) నటించిన సైంధవ్ థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
ఇక ఆదివారం నాగార్జున (Nagarjuna)నా సామిరంగ (Na Saami Ranga)సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ రెండింటిలో ఒక్క మూవీకి హిట్ టాక్ వచ్చినా గుంటూరు కారంకు భారీ ఎఫెక్ట్ తగులుతుంది.